Home Actor దిల్ రాజు, అల్లు అర‌వింద్ క‌లిసి బాలీవుడ్ మూవీ ప్లాన్ చేస్తున్నారా.?

దిల్ రాజు, అల్లు అర‌వింద్ క‌లిసి బాలీవుడ్ మూవీ ప్లాన్ చేస్తున్నారా.?

21
0
దిల్ రాజు, అల్లు అర‌వింద్ క‌లిసి బాలీవుడ్ మూవీ ప్లాన్ చేస్తున్నారా.? spiceandhra

ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు… ఎప్ప‌టి నుంచో బాలీవుడ్ మూవీ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. భార‌తీయుడు 2 సినిమాని హిందీలో దిల్ రాజు నిర్మించాలి అనుకున్నారు. ఎనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు అయితే.. కొన్ని కార‌ణాల వ‌ల‌న ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు విక్ట‌రీ వెంక‌టేష్ – మెగా హీరో వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్ లో రూపొందిన ఎఫ్ 2 చిత్రాన్ని దిల్ రాజు హిందీలో రీమేక్ చేస్తున్నారు.

ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో మ‌రో సినిమాని కూడా దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. ఇంత‌కీ ఏ సినిమా అంటారా..?  నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన జెర్సీ. తెలుగులో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమాని మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ తో క‌లిసి నిర్మించ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. జెర్సీ చిత్రానికి ద‌ర్శ‌కత్వం వ‌హించిన గౌత‌మ్ తిన్న‌నూరి హిందీ రీమేక్ కి కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడ‌ని స‌మాచారం. హీరో ఎవ‌ర‌నేది ఇంకా ఫైన‌ల్ కాలేదు. అంతా ఫైన‌ల్ అయిన త‌ర్వాత  త్వ‌ర‌లోనే అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేయ‌నున్నార‌ని తెలిసింది.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here