Home Telugu దిల్ రాజు టార్గెట్ ఇదే..!

దిల్ రాజు టార్గెట్ ఇదే..!

114
0
Dil Raju Bollywood movie

కుటుంబం అంతా క‌లిసి చూసి ఎంజాయ్ చేసేలా సినిమాలు నిర్మిస్తూ…అభిరుచి గ‌ల నిర్మాత‌గా సుస్థిర స్ధానం సంపాదించుకున్న‌ ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు. యువ హీరో రాజ్ త‌రుణ్ తో ఆయ‌న నిర్మించిన చిత్రం ల‌వ‌ర్. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రూపొందిన ల‌వ‌ర్ మూవీ ఈ నెల 20న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన దిల్ రాజు త‌న టార్గెట్ ఏంట‌నేది చెప్ప‌క‌నే చెప్పారు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే..దిల్ రాజు 27 సినిమాలు నిర్మించారు.  వీటిలో 22 సినిమాలు స‌క్స‌స్ సాధించ‌డం విశేషం.

28వ సినిమాగా ల‌వ‌ర్ సినిమాని నిర్మించారు. ఈ సంవ‌త్స‌రం మ‌రో మూడు సినిమాలు నిర్మిస్తున్నారు. రామ్ తో హ‌లో గురు ప్రేమ కోస‌మే, వెంక‌టేష్ – వ‌రుణ్ తేజ్ తో ఎఫ్ 2, మ‌హేష్ బాబు 25వ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే… 2020లో ఆయ‌న బాలీవుడ్ మూవీ చేయ‌నున్న‌ట్టు ఎనౌన్స్ చేసారు. ప్ర‌స్తుతానికి ఆయ‌న టార్గెట్ ఇదే. అయితే..బాలీవుడ్ లో ఎవ‌రితో సినిమా చేయ‌నున్నారు..?   హీరో ఎవ‌రు..?  డైరెక్ట‌ర్ ఎవ‌రు..?  అనేది మాత్రం చెప్ప‌లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here