Home Actor దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో కీర్తి సురేష్‌, ఆది పినిశెట్టి చిత్రం

దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో కీర్తి సురేష్‌, ఆది పినిశెట్టి చిత్రం

36
0
దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో కీర్తి సురేష్‌, ఆది పినిశెట్టి చిత్రం spiceandhra

అభిరుచి గ‌ల‌ నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో కీర్తి సురేశ్‌, ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబు కాంబినేష‌న్‌లో బాలీవుడ్ ద‌ర్శ‌కుడు న‌గేశ్ కుకునూర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోంది.  స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందుతోంది. `హైద‌రాబాద్ బ్లూస్‌`,`ఇక్బాల్‌` వంటి సినిమాల‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన బాలీవుడ్ డైరెక్ట‌ర్ న‌గేశ్ కుకునూర్ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈయ‌న చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగు పెడుతున్నారు.

స్పోర్ట్స్ జోన‌ర్‌లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. ఆగ‌స్ట్‌లో చివ‌రి షెడ్యూల్‌ను చిత్రీక‌రించ‌నున్నారు. మంచి కంటెంట్ ఉన్న చిత్రాల‌కు స‌పోర్ట్ చేసే హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి చిరంత‌న్ దాస్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

కీర్తిసురేష్‌, ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబు, రాహుల్ రామ‌కృష్ణ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం: న‌గేశ్ కుకునూర్‌, స‌మ‌ర్ప‌ణ‌: దిల్‌రాజు(శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌), బ్యాన‌ర్‌: వ‌ర్త్ ఏ షాట్ మోష‌న్ ఆర్ట్స్‌, నిర్మాత‌: సుధీర్ చంద్ర‌, కో ప్రొడ్యూస‌ర్‌: శ్రావ్యా వ‌ర్మ‌, మ్యూజిక్‌: దేవిశ్రీ ప్ర‌సాద్‌, సినిమాటోగ్ర‌ఫీ: చిరంత‌న్ దాస్‌.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here