Home Actor దేవుడు సందీప్ కిషన్ కష్టాన్ని గుర్తించి మంచి హిట్ ఇచ్చాడు – ఎస్‌.ఎస్‌. త‌మ‌న్‌

దేవుడు సందీప్ కిషన్ కష్టాన్ని గుర్తించి మంచి హిట్ ఇచ్చాడు – ఎస్‌.ఎస్‌. త‌మ‌న్‌

46
0
దేవుడు సందీప్ కిషన్ కష్టాన్ని గుర్తించి మంచి హిట్ ఇచ్చాడు – ఎస్‌.ఎస్‌. త‌మ‌న్‌ spiceandhra

సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించి, నిర్మించిన‌ చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. అన్యా సింగ్ కథానాయిక. కార్తీక్ రాజు దర్శకుడు. వెంకటాద్రి టాకీస్ (ప్రొడక్షన్ నంబర్ 1), వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాల పై ఈ సినిమా తెరకెక్కింది. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ నిర్మాతలు. ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ అనిల్ సుంకర సమర్పణలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలై ప్రేక్షకుల నుండి మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. స‌క్సెస్‌టూర్‌కు వెళిన సందీప్ కిష‌న్‌, హీరోయిన్ అన్యా సింగ్‌, ఇత‌ర టీమ్ స‌భ్యుల‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ లో ఈ సినిమా థాంక్యూ మీట్ నిర్వహించారు.

ఈ వేడుక‌లో సంగీత ద‌ర్శ‌కుడు ఎస్.ఎస్. తమన్ మాట్లాడుతూ… “దేవుడు సందీప్ కిషన్ కష్టాన్ని గురించాడు. కొన్ని సినిమాలు చేసేటప్పుడు క‌మ‌ర్షియ‌ల్‌గా ఏం ఆలోచించం. మ‌న‌కు మ‌నుషులు ముఖ్య‌మ‌ని అనుకుంటాం. వాళ్లు మనకు చాలా అవసరమని భావిస్తాం. సందీప్ నాకు మంచి ఫ్రెండ్. తన కోసం నేను ఈ సినిమా చేశాను. ఎగ్జిక్యూటివ్ నిర్మాత శివ చెర్రి, ఈ టీమ్ అంతా చాలా కసిగా సినిమా చేశారు. దర్శకుడు కార్తీక్ రాజు విఎఫ్ఎక్స్‌లో మంచి క‌మాండ్ ఉన్న వ్య‌క్తి. ఆయన కథ చెప్పినప్పుడు చాలా బావుందని సందీప్ కి చెప్పాను. సందీప్ గెలవాలని, అతణ్ణి ఎలాగైనా గెలిపించాలని ఒకే ఉద్దేశ్యంతో ఈ సినిమా చేశాం. ఈ రోజు సినిమా ఇంత మంచి విజ‌యం సాధించ‌డం చాలా చాలా సంతోషంగా ఉంది.

నేను స‌క్సెస్‌టూర్‌కి వెళ్లాల్సింది. కానీ, కుద‌ర‌లేదు. నేనింకా షాక్‌లోంచి బ‌య‌ట‌కు రాలేదు. సందీప్‌కి స‌క్సెస్ వ‌చ్చేసిందా? మ‌నోడికి స‌క్సెస్ వ‌చ్చేసిందా? అనుకుంటున్నా. నాకు తెలిసిన వ్య‌క్తుల‌ను, ట్రేడ్ వ‌ర్గాల‌ను క‌నుక్కున్నా. ఇన్వెస్ట్ చేసిన డ‌బ్బు కంటే ఎక్కువ వ‌చ్చింది. మేం హ్యాపీ. సందీప్ గెలిచాడని సంతోషంగా ఉంది. తన లాంటి హార్డ్ వర్కర్స్ గెలవాలి. ఇటువంటి కొత్త సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి అయినా గెలవాలి.

చాలామందికి ఇటువంటి కథతో సినిమా చేయడానికి ధైర్యం చాలదు. ఆ ధైర్యానికి సందీప్ ని మనం మెచ్చుకోవాలి. భవిష్యత్తులోనూ అతడికి మంచి విజయాలు రావాలి. నిర్మాతలు, ఇతర టీమ్ సభ్యులకు కంగ్రాట్స్. రాత్రీపగలూ కష్టపడి చేశారు. వాళ్లు విడుదల తరవాత కూడా బాగా ప్రమోట్ చేశారు. ఎన్నో పెద్ద సినిమాల మధ్య ఈ సినిమాను గెలిపించారు. మంచి సినిమాను ప్రేక్షకుల మధ్యకు తీసుకువెళ్లారు” అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here