Home Movie News దేవ‌దాస్ ఫ‌స్ట్ సింగిల్ వ‌చ్చేసింది.. న‌చ్చేసింది..!

దేవ‌దాస్ ఫ‌స్ట్ సింగిల్ వ‌చ్చేసింది.. న‌చ్చేసింది..!

89
0

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున – నేచుర‌ల్ స్టార్ నాని కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ దేవ‌దాస్. శ్రీరామ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పై అశ్వ‌నీద‌త్ నిర్మిస్తోన్న ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ కి అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది. స్వ‌ర‌బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలోని పాట‌ల్లో వారు వీరు అంతా చూస్తూ ఉన్నా…ఊరు పేరు అడిగేయాల‌నుకున్నా..అంతో ఇంతో ధైర్యంగానే ఉన్నా..తాడో పేడో తేల్చేద్దాం అనుకున్నా..అంటూ సాగే  పాట‌ను ఈరోజు ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేసారు.

సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి రాసిన ఈ పాట‌ను  అనురాగ్ కుల‌క‌ర్ణి, అంజ‌నా సౌమ్య పాడ‌గా ప్రేమ్ ర‌క్షిత్ కొరియోగ్ర‌ఫీలో చిత్రీకరించారు. ఈ సాంగ్ విన్న వెంట‌నే ప్ర‌తి ఒక్క‌రికి న‌చ్చేసింది. దీంతో ఈ సాంగ్ కి మంచి ఫీడ్ బ్యాక్ వ‌చ్చింది.  ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. డాన్ గా నాగార్జున‌, డాక్ట‌ర్ గా నాని న‌టిస్తోన్న ఈ మూవీ ఎంట‌ర్ టైన్మెంట్ తో పాటు హృద‌యానికి హ‌త్తుకునేలా ఉంటుంద‌ని టాక్ వినిపిస్తోంది. క‌థానాయిక‌లు ర‌ష్మిక మంద‌న్న‌, ఆకాంక్ష సింగ్ న‌టిస్తోన్న ఈ చిత్రంలో న‌రేష్ వికే, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్, రావు ర‌మేష్, వెన్నెల కిషోర్, అవ‌స‌రాల శ్రీ‌నివాస్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ ను సెప్టెంబ‌ర్ 27న రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here