Home Movie Reviews దేవ‌దాస్ రివ్యూ..!

దేవ‌దాస్ రివ్యూ..!

80
0
DoFtQ1HVsAAEeei

టాలీవుడ్ కింగ్  నాగార్జున‌, నేచుర‌ల్ స్టార్ నాని కాంబినేష‌న్ లో భారీ మ‌ల్టీస్టార‌ర్ అని ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి…ఈ ప్రాజెక్ట్ పై అటు అభిమానుల్లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. దీనికి తోడు ఇటీవ‌ల మ‌హాన‌టి సినిమాతో సంచ‌ల‌న విజ‌యం సాధించిన భారీ చిత్రాల నిర్మాణ సంస్థ వైజ‌యంతీ మూవీస్ నిర్మాణం..మ‌ళ్లీ రావా ఫేమ్ ఆకాంక్ష సింగ్, ఛ‌లో, గీత గోవిందం చిత్రాల‌తో స‌క్స‌స్ సాధించిన ర‌ష్మిక న‌టించ‌నుండ‌డంతో దేవ‌దాస్ పై మ‌రింత ఆస‌క్తి పెరిగింది. ఎన్నో అంచ‌నాల మ‌ధ్య దేవ‌దాస్ ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ రోజు (సెప్టెంబ‌ర్ 27) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి…దేవ‌దాస్ అంచ‌నాల‌ను అందుకున్నాడో..?  లేదో..?  చెప్పాలంటే ముందుగా క‌థ చెప్పాల్సిందే.

క‌థ – దేవ(నాగార్జున‌) డాన్. మ‌నిషి క‌న‌ప‌డ‌డు కానీ..అత‌ను చేసే ప‌నులు మాత్రం క‌నిపిస్తుంటాయి. దీంతో దేవ అంటే అంద‌రికీ భ‌యం. దేవ‌ని ప‌ట్టుకోవ‌డానికి పోలీసులు రంగంలోకి దిగుతారు. ఇక దాస్ (నాని) డాక్ట‌ర్. కార్పోరేట్ హాస్ప‌ట‌ల్ లో డాక్ట‌ర్ అయిన దాస్..అక్క‌డ ఇమ‌డ‌లేక ఓ క్లినిక్ పెట్టుకుని వైద్యం చేస్తుంటాడు. దేవ‌కి పోలీసుల‌కు మ‌ధ్య జ‌రిగిన కాల్పుల్లో దేవ బాడీలో బుల్లెట్ దూసుకెళుతుంది. దీంతో దాస్ క్లినిక్ కి దేవ వ‌స్తాడు.  అక్క‌డ నుంచి  వీరిద్ద‌రి మ‌ధ్య స్నేహం ఏర్ప‌డుతుంది. ఇదిలా ఉంటే..దాస్ పూజా (ర‌ష్మిక‌)ని తొలిచూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు. దేవ జాహ్న‌వి (ఆకాంక్ష సింగ్) ని ఇష్ట‌ప‌డ‌తాడు. దేవ ఎందుకు డాన్ గా మారాల్సి వ‌చ్చింది. ప్రాణాలు పోసే డాక్ట‌ర్ దాస్ ని క‌లిసిన త‌ర్వాత‌  ప్రాణాలు తీసే దేవ‌లో వ‌చ్చిన మార్పు ఏంటి..?  ఆఖ‌రికి వీరిద్ద‌రి ప్రేమ‌క‌థ ఏమైంది..?  దేవ పోలీసుల‌కు దొర‌కాడా..?  లేదా..?  అనేదే మిగిలిన క‌థ‌.

ప్ల‌స్ పాయింట్స్

నాగార్జున‌, నాని న‌ట‌న‌

మ‌ణిశ‌ర్మ మ్యూజిక్

కామెడీ

సినిమాటోగ్ర‌ఫీ

వైజ‌యంతీ మూవీస్ నిర్మాణం

సంభాష‌ణ‌లు

మైన‌స్ పాయింట్స్

ప్రేమ‌క‌థ త‌క్కువుగా ఉండ‌డం

అక్క‌డ‌క్క‌డ లాజిక్స్ మిస్ అవ్వ‌డం

విశ్లేష‌ణ – దేవ లాంటి పాత్ర‌ల్లో న‌టించ‌డం అంటే నాగ్ కు చాలా ఈజీ. నాగ్ ని డైరెక్ట‌ర్ శ్రీరామ్ ఆదిత్య చాలా బాగా చూపించాడు. డ్యాన్స్, స్టైల్, డైలాగ్స్..ఇలా అన్నింటిలో నాగ్ త‌న‌దైన స్టైల్ లో న‌టించాడు. ఈ అక్కినేని అంద‌గాడు మ‌రింత అందంగా క‌నిపించాడు. ముఖ్యంగా పాట‌ల్లో ఆయ‌న స్టైల్ చూస్తుంటే…నిజంగానే ఈయ‌న‌కి వ‌య‌సు పెర‌గ‌డం కాకుండా త‌రుగుతుందా అనిపిస్తుంటుంది. ఇక నాని అమాయ‌కంగా క‌నిపించే దాస్ పాత్ర‌లో అద్భుతంగా న‌టించి మ‌రోసారి నేచుర‌ల్ స్టార్ శ‌భాష్ అనిపించాడు. వీరిద్ద‌రి పై చిత్రీక‌రించిన ప్ర‌తి సీన్ ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటూ.. క‌డుపుబ్బా న‌వ్వుకునేలా  చిత్రీక‌రించాడు డైరెక్ట‌ర్ ఆదిత్య‌. న‌వీన్ చంద్ర‌ను దేవ షూట్ చేసిన‌ప్పుడు దేవ‌, దాస్ మ‌ధ్య జ‌రిగే సంభాష‌ణ చాలా ట‌చ్చింగ్ ఉంది. అలాగే…ఉత్తేజ్ పై చిత్రీక‌రించిన సీన్, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్ కొడుకు సీన్ ఎమోష‌న‌ల్ గా ఆడియ‌న్స్ క‌నెక్ట్ అయ్యేలా చిత్రీక‌రించ‌డంలో డైరెక్ట‌ర్ శ్రీరామ్ ఆదిత్య స‌క్స‌స్ అయ్యాడు.

పూజా పాత్ర‌లో ర‌ష్మిక‌, జాహ్న‌వి పాత్ర‌లో ఆకాంక్ష సింగ్ న‌టించారు. పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్టుగా వీరిద్ద‌రు బాగానే న‌టించారు. అయితే…దేవ‌దాస్ టైటిల్ అన‌గానే ప్రేమ‌క‌థ‌కు ఎక్కువ స్కోప్ ఉంటుంది అనుకుంటారు కానీ..ప్రేమ‌క‌థ ఇందులో కాస్త త‌క్కువ ఉంద‌నే చెప్పాలి. దేవ ల‌వ్ స్టోరీ, దాస్ ల‌వ్ స్టోరీ ఇంకొంచెం ఎక్కువ ఉంటే ఇంకా బాగుండేది. స్వ‌ర‌బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం, శ్యామ్ ద‌త్ సినిమాటోగ్ర‌ఫీ ఈ సినిమాకి ప్ల‌స్ పాయింట్స్. ప్ర‌తి పాట‌, రీ రికార్డింగ్ సూప‌ర్ అనేలా మ‌ణిశ‌ర్మ సంగీతం అందించారు. ఇక శ్యామ్ ద‌త్ కెమెరా వ‌ర్క్ ప్ర‌తి ఫ్రేమ్ లో క‌నిపిస్తుంది. వైజ‌యంతీ మూవీస్ ఏమాత్రం రాజీప‌డ‌కుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాని నిర్మించారు. ముఖ్యంగా సాంగ్స్ ను క‌ల‌ర్ ఫుల్ గా రూపొందించిన సెట్ లో చిత్రీక‌రించిన విధానం చాలా బాగుంది. విల‌న్ గా న‌టించిన కునాల్ క‌పూర్,  వెన్నెల కిషోర్, రావు ర‌మేష్, స‌త్య‌, ముర‌ళీశ‌ర్మ‌, అవ‌స‌రాల శ్రీనివాస్ పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్టు న‌టించారు. దేవ‌దాస్ గురించి ఒక్క మాట‌లో చెప్పాలంటే…క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అంద‌ర్నీ ఆక‌ట్టుకునే ఎంట‌ర్ టైన‌ర్ దేవ‌దాస్.

రేటింగ్ – 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here