Home News దేశ చరిత్రలో ఇలాంటి సైబర్ క్రైం జరిగి ఉండదు – వైసీపీ అధ్యక్షుడు జ‌గ‌న్.

దేశ చరిత్రలో ఇలాంటి సైబర్ క్రైం జరిగి ఉండదు – వైసీపీ అధ్యక్షుడు జ‌గ‌న్.

103
0

వైసీపీ అధ్య‌క్షుడు వై.ఎస్.జ‌గ‌న్ గ‌వ‌ర్న‌ర్ తో భేటీ అయ్యారు. భేటీ అనంత‌రం జ‌గ‌న్ మాట్లాడుతూ…రాబోయే రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తాం.ఆంధ్ర రాష్ట్రంలో సీఎం స్థాయి వ్యక్తి సైబర్ క్రైంకి పాల్పడితే దొంగతనం కాదా అని అడిగాము. చంద్రబాబు చేసిన పనిని వివరించాం. దేశ చరిత్రలో ఇలాంటి సైబర్ క్రైం జరిగి ఉండదు అన్నారు. రెండేళ్ల నుంచి పద్దతి ప్రకారం సైబర్ క్రైం చేస్తున్నారు. ఐటీ గ్రిడ్ పై రైడ్ జరిగింది…ఆశ్చర్య కరమైన విషయాలు బయటకు వచ్చాయి. టీడీపీ కి చెందిన సేవ మిత్ర యాప్ ని ఐటీ గ్రిడ్ తయారు చేసింది.

ఆధార్, డీటెయిల్స్ ఎవరి దగ్గర ఉండకూడదు. అవి ఏ రకంగా ఐటీ గ్రిడ్ లో కనిపిస్తున్నాయి. ఆధార్ వివరాలు టీడీపీ సేవ మిత్ర యాప్ లో ప్రైవేట్ కంపెనీలో కనపడటం నేరం కాదా అని ప్ర‌శ్నించారు. ఓటర్ లిస్ట్ మాస్టర్ కాపీ ఏవిధంగా ఐటీ గ్రిడ్ ,టీడీపీ సేవ మిత్ర యాప్ లో ఉన్నాయి. రాష్ట్ర ప్రజల బాంక్ ఎకౌంట్ వివరాలు ఇట్ గ్రిడ్,టీడీపీ సేవ మిత్ర యాప్ లో ఉన్నాయి. రేపు మీ అంతట మీరే ఏమి చేసినా ,ప్రజలు మోస పోరా…నాశనం అయిపోరా అన్నారు.

సర్వేల పేరుతో చంద్రబాబు డేటా ని సేవ మిత్రా యాప్ లో ఇంస్టాల్ చేశారు. ఓటరు ఎవరికి ఓటు వేస్తున్నారూ అని గ్రామాలకు వెళ్లి సర్వే చేస్తున్నారు…టీడీపీ కి ఓటు వేయని వారి ఓట్లు తొలగిస్తున్నారు. టీడీపీ కి అనుకూలంగా ఉన్న వారికి రెండు ఓట్లు నమోదు చేస్తున్నారు.

గత ఎన్నికల్లో మాకు టీడీపీ కి ఓట్ల తేడా ఒక్క శాతం. ఎన్నికల సంగం చేసే విచారణకు మేము సహకరిస్తుంటే…సీఎం  పోలీస్ ఉపయోగించి ఫార్మ్ 7 అప్లై చేసిన వారిని హేరాష్ చేస్తున్నారు. రెండేళ్లుగా చంద్రబాబు చేస్తుంది తప్పు…ఫార్మ్ 7 అప్లై చేయడం తప్పు. ఆధార్ డేటా ,బ్యాంక్,ఓటరు id డీటెయిల్స్ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉంటే అది నేరం. ప్రైవేట్ వ్యక్తులకు డేటా చోరీ చేసి ఇచ్చిన వ్యక్తి సీఎం గా ఉండటానికి అర్హుడేనా. చంద్రబాబు, ఆయన కొడుకుని జైల్లో పెట్టె నేరాలు. నేరం ఎక్కడ జరిగితే అక్కడ కేసు పెడతారు. చేసేది తప్పు..దానిని ఆంధ్ర ,తెలంగాణ గొడవ కింద తప్పు దోవ పట్టిస్తున్నారు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here