Home News దేశ భ‌ద్ర‌త క‌న్నా రాజ‌కీయ భ‌ద్ర‌తే మోదీకి ముఖ్యం – చంద్ర‌బాబు నాయుడు.

దేశ భ‌ద్ర‌త క‌న్నా రాజ‌కీయ భ‌ద్ర‌తే మోదీకి ముఖ్యం – చంద్ర‌బాబు నాయుడు.

71
0

ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఈరోజు అమ‌రావ‌తిలో టీడీపీ నేత‌లు, ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ…ఏపీలో కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో నేరగాళ్లతో మనం పోరాటం చేయబోతున్నాం. వైసీపీ నేర, చిల్లర రాజకీయాలు చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం వస్తే కనీసం నిలదీసే ధైర్యం కూడా వైసీపీకి లేదా? అని ప్రశ్నించారు.

ట్విట్ట‌ర్ లో చంద్ర‌బాబు స్పందిస్తూ…బీజేపీ నమ్మకద్రోహం పై రాష్ట్రం అంతా నిరసనలు వెల్లువెత్తాయి. దేశంలో ఇప్పటి వరకు ఏ ప్రధానికి ఇంత నిరసనలు లేవు. గతంలో ఏ ప్రధానికి ఇన్ని నల్ల జెండాలు లేవు. విఫల ప్రధానిగా నరేంద్ర మోదీ మారారు. మోదీకి దేశభక్తి కంటే రాజకీయ భక్తి  ఎక్కువ. దేశ భద్రత కన్నా రాజకీయ భద్రతే మోదీకి ముఖ్యం. రాజకీయం కోసం దేనికైనా దిగజారే పార్టీ బిజెపి. ఎన్నికల్లో లబ్ది కోసం ఎంతకైనా దిగజారే పార్టీ బీజేపీ. స్వార్ధం కోసం దేనికైనా దిగజారే పార్టీ వైసీపీ.

నిజాయితీ పరులంతా టీడీపీలో చేరుతున్నారు. దశాబ్దాల వైరం వీడి టీడీపీకి సంఘీభావం తెలుపుతున్నారు. ఇందుకు కర్నూలులో కోట్ల, కెఈ కుటుంబాలే రుజువు. విజయనగరంలో బొబ్బిలి, గజపతి రాజులే సాక్ష్యం. కడపలో వర్గాలన్నీ ఏకమై టీడీపీతో కలిశాయి. ఇదే స్ఫూర్తి రాష్ట్రం అంతా రావాలి అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here