Home Actor దొడ్డిదారిన కాదు.. రాజ మార్గంలో రాజ‌కీయాల్లోకి తెస్తున్నాం – పవన్ కళ్యాణ్‌.

దొడ్డిదారిన కాదు.. రాజ మార్గంలో రాజ‌కీయాల్లోకి తెస్తున్నాం – పవన్ కళ్యాణ్‌.

117
0


సోద‌రుడు నాగ‌బాబు త‌న‌కు రాజ‌కీయ గురువనీ, త‌న‌లో రాజ‌కీయ చైత‌న్యం నింపిన వ్య‌క్తి అని జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చెప్పారు. నాగబాబును రాజ మార్గంలో రాజకీయాల్లోకి తీసుకొస్తున్నామ‌ని, దొడ్డిదారిన కాకుండా ప్ర‌జా తీర్పు కోసం ధైర్యంగా ఎన్నిక‌ల ర‌ణ‌క్షేత్రంలో పోటీకి నిల‌బెడుతున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ రోజు ఉద‌యం మంగ‌ళ‌గిరి పార్టీ కార్యాల‌యంలో ప్ర‌ముఖ న‌టుడు, నిర్మాత‌,  ప‌వ‌న్ క‌ళ్యాణ్ సోద‌రుడు నాగ‌బాబు జ‌న‌సేన పార్టీలో చేరారు.  శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆయ‌న‌కు కండువా క‌ప్పి పార్టీలోకి ఆత్మీయంగా ఆహ్వానం ప‌లికారు. నాగబాబు నరసాపురం లోక్ సభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా బరిలో నిలబడుతున్నారు.

ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ.. శ్రీ నాగ‌బాబు గారికి రాజ‌కీయాల పై స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న ఉంది. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండే వ్య‌క్తి. అందుకే  ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం లోక్ స‌భ స్థానం నుంచి  పోటీకి దించుతున్నాం. అన్నింటిని వదులుకుని రాజ‌కీయాల‌తో సంబంధం లేకుండా త‌న‌దైన జీవితం గడుపుతున్న వ్య‌క్తి.. తన ఆహ్వానం మేర‌కు  రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనకు మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాను అని చెప్పారు.

 మీ అంద‌రిలా నాకూ ఆయ‌న నాయ‌కుడే

నాగ‌బాబు మాట్లాడుతూ… “నేను ఎత్తుకొని ఆడించిన  మా త‌మ్ముడు మేమంతా ఆశ్చ‌ర్య‌పోయే రీతిలో ఉన్న గొప్ప నాయకుడు. మ‌న దేశంలోనే ఇలాంటి నాయ‌కుడు ఉన్నాడా అనే స్థాయికి ఎదిగారు. గొప్ప వ్య‌క్తిత్వం కళ్యాణ్ బాబుకి ఉంది. ఆయ‌న వ్య‌క్తిత్వం జ‌న‌సేన‌లో ఉన్న చాలా మంది కంటే నాకే ఎక్కువ తెలుసు.  త‌మ్ముడిని ఓ నాయ‌కుడిగా చూద్దాం అని అనుకున్నా.  పార్టీలోకి ఆహ్వానించిన‌ప్పుడు న‌మ్మ‌లేదు. పేరుకే ఆయ‌న నాకు త‌మ్ముడు. అంద‌రిలా నాకు నాయ‌కుడే. పార్టీలో చేర‌క ముందే నా నాయ‌కుడు శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కోసం ఏ ప‌ని చేయ‌డానికి అయిన సిద్ధ‌మ‌య్యాను. త‌మ్ముడు ఇచ్చిన స్ఫూర్తితో ముందుకి వెళ్తాను” అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here