Home Actor దొర‌సాని రివ్యూ

దొర‌సాని రివ్యూ

240
0
దొర‌సాని రివ్యూ spiceandhra

ఆనంద్ దేవ‌ర‌కొండ‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్ హీరో, హీరోయిన్ గా ప‌రిచ‌యం చేస్తూ రూపొందిన చిత్రం దొర‌సాని. నూత‌న ద‌ర్శ‌కుడు కె.ఆర్.మ‌హేంద్ర ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. డి. సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో మ‌ధుర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి. సెన్సేష‌న‌ల్ స్టార్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ సోద‌రుడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌, జీవితా రాజ‌శేఖ‌ర్ రెండో కుమార్తె శివాత్మిక ఈ సినిమా ద్వారా ప‌రిచ‌యం అవుతుండ‌డం.. పాట‌ల‌కు మంచి స్పంద‌న రావ‌డంతో దొర‌సాని సినిమా పై క్రేజ్ ఏర్ప‌డింది. ఈ రోజు దొర‌సాని ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి.. దొర‌సాని ప్రేక్ష‌కుల‌ను మెప్పించిందా..?  లేదా..?  అనేది చెప్పాలంటే ముందుగా క‌థ చెప్పాల్సిందే.

– రాజు (ఆనంద్ దేవ‌ర‌కొండ‌) తెలంగాణ‌లోని ఓ ఊరులో ఇళ్ల‌కు సున్నాలేసుకునే కూలోడి కొడుకు. దేవ‌కి (శివాత్మిక‌) ఆ ఊరి దొర కూతురు చిన్న దొర‌సాని. వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ పుడుతుంది. ఒక‌రినొక‌రు ప్రేమించుకుంటారు. పేదోడు త‌న ప‌క్క‌న నిలబ‌డితేనే స‌హించ‌ని దొర త‌న కూతురును పేదోడు ప్రేమిస్తే స‌హిస్తాడా..?  ఈ విష‌యం తెలిసి ఆ దొర ఏం చేసాడు..?  చివ‌రికి రాజు, దొర‌సాని ల ప్రేమ‌క‌థ ఏమైంది అనేదే మిగిలిన క‌థ‌.

విశ్లేష‌ణ – గొప్పంటి అమ్మాయిని పేదొడు కొడుకు ప్రేమించ‌డం… అనే కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వ‌చ్చాయి. అయితే.. ఈ సినిమాలో ఉన్న కొత్త‌ద‌నం ఏంటంటే… తెలంగాణ నేప‌థ్యం. ఈ సినిమా స్టార్ట్ అయిన కొద్ది సేప‌టికే  ప్రేక్ష‌కుడు 1980 కాలానికి వెళ్లిపోతాడు. నూత‌న ద‌ర్శ‌కుడు మ‌హేంద్ర తెర‌కెక్కించిన ఈ సినిమా క‌థ‌లో నిజాయితీ క‌నిపించింది. ఎక్క‌డా ఒక్క సీన్ కూడా కావాల‌ని పెట్టిన‌ట్టు అనిపించ‌దు. అప్పుడు దొర‌ల వ్య‌వ‌స్ధ ఎలా ఉండేది.. మాటలు ఎలా ఉండేవి.. అనేది క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టుగా చూపించాడు.

ఆనంద్ కూలోడి కొడుకు పాత్ర‌లో.. ఫ‌స్ట్ మూవీయే అయిన‌ప్ప‌టికీ చాలా బాగా న‌టించాడు. ఈ సినిమాలో పోలీస్ స్టేష‌న్ లో రాజును బ‌ట్ట‌లు విప్పేసి కొడ‌తారు. ఆ సీన్ లో న‌గ్నంగా న‌టించాడు. ఆ సీన్ లో న‌గ్నంగా న‌టించాడంటే.. న‌ట‌న ప‌ట్ల సినిమా ప‌ట్ల అత‌నికున్న అంకితభావం తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి హైలైట్ అంటే శివాత్మిక న‌ట‌న అని చెప్ప‌చ్చు. దొర‌సానిగా హుందాత‌నం చూపిస్తూ… అలాగే ప్రియుడు కోసం త‌పించే ప్రియురాలిగా అద్భ‌తంగా న‌టించి తొలి చిత్రంతోనే విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంటుంది. పోలీస్ స్టేష‌న్ లో ఆమె న‌ట‌న కంట‌తడి పెట్టిస్తుంది.

దొర పాత్ర‌, దాసిగా ఉండే శ‌రణ్య‌, రాజు స్నేహితులు.. ఇలా అంద‌రు చాలా చ‌క్క‌గా న‌టించారు. ఈ క‌థ‌ను ద‌ర్శ‌కుడు చాలా నిజాయితీగా చెప్పాడు కాక‌పోతే క‌థ‌నం స్లోగా ఉన్న ఫీలింగ్ క‌లుగుతుంది. ఈ సినిమాకి న‌టీన‌టులు న‌ట‌న‌, ప్ర‌శాంత్ విహ‌రీ సంగీతం, స‌న్ని కెమెరా వ‌ర్క్ ప్ర‌ధాన బ‌లం. ఈ చిత్ర నిర్మాత‌లు ఏమాత్రం రాజీప‌డ‌కుండా మంచి సినిమాని అందించాల‌నే ఉద్దేశ్యంతో మంచి క్వాలిటీతో ఈ సినిమాని నిర్మించారు.  ప్రేమికుల‌కు బాగా క‌నెక్ట్ అయ్యే దొర‌సాని.

రేటింగ్ – 2.75/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here