Home Actor దొర‌సాని వ‌చ్చేసింది..!

దొర‌సాని వ‌చ్చేసింది..!

151
0

విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌, హీరో రాజ‌శేఖ‌ర్, జీవితల కుమార్తె శివాత్మిక‌ను హీరో, హీరోయిన్ గా ప‌రిచ‌యం చేస్తూ రూపొందుతోన్న చిత్రం దొర‌సాని. ఈ చిత్రానికి కె.వి.ఆర్ మ‌హేంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ తో పాటు మధుర ఎంటర్ టైన్మెంట్, బిగ్ బెన్ సినిమా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. త్వ‌ర‌లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా దొర‌సాని ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసారు.

తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రేమ‌క‌థ ఇద‌ని..ఈ క‌థ‌ను రాయ‌డానికి ఐదేళ్ల ప‌ట్టింద‌ని ద‌ర్శ‌కుడు కె.వి.ఆర్ మ‌హేంద్ర అన్నారు. కుల వ్య‌వ‌స్ధ‌కు వ్య‌తిరేకంగా ఇద్ద‌రు ప్రేమికులు ఏం చేసారు అనేదే ఈ క‌థ‌. ఫ‌స్ట్ లుక్ చూస్తుంటే… ఆనంద్ దేవ‌ర‌కొండ‌, శివాత్మిక పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్టుగా అద్భుతంగా న‌టించార‌నిపిస్తుంది. టీజ‌ర్ ను జూన్ 6న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు తెలియ‌చేసారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here