Home Entertainment దోచుకోవ‌డం..దాచుకోవ‌డం జ‌గ‌న్, అత‌ని కుటుంబ స‌భ్యుల‌కు అల‌వాటుగా మారింది. – ఏపీ ఉప ముఖ్యమంత్రి...

దోచుకోవ‌డం..దాచుకోవ‌డం జ‌గ‌న్, అత‌ని కుటుంబ స‌భ్యుల‌కు అల‌వాటుగా మారింది. – ఏపీ ఉప ముఖ్యమంత్రి కే.ఈ. క్రిష్ణమూర్తి

84
0


దోచుకోవడం, దాచుకోవడం…జగన్, అతని కుటుంబ సభ్యులకు అలవాటుగా మరింది అని ఏపీ ఉప ముఖ్య‌మంత్రి కే.ఈ.క్రిష్ణ‌మూర్తి అన్నారు. తన తాత ఒక బిసి వ్యక్తిని హత్య చేసి గనులు దోచుకుంటే.. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని జగన్ రాష్ట్ర ప్రజల సొమ్మును దోచుకున్నారు. ప్రైవేటు కంపెనీ పై తప్పుడు కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ  కార్యకర్తల సమాచారాన్ని జగన్ తస్కరించాడని ఆయ‌న ఆరోపించారు. ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం నిసిగ్గుగా పాలుపంచుకుంది.

రాష్ట్ర ప్రజల సొమ్ము దోచుకున్న గజ దొంగ జగన్ కు…డేటా దొంగలించి ఇచ్చి చిన్న దొంగ సహకరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచారం ప్రైవేటు కంపెనీ తస్కరించిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సమాచారం పోతే ప్రభుత్వం ఫిర్యాదు చేయాలి. ఎవరో ప్రైవేటు వ్యక్తి ఫిర్యాదు చేశాడని తెలుగుదేశం పార్టీకి ఐటి సొల్యూషన్స్ అందిస్తున్న కంపెనీ పై దాడి చేయడం దుర్మార్గం. సేవామిత్ర అనేది  తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యాప్… దీనిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వారికి అందుతున్న సంక్షేమ పథకాల సమాచారం మాత్రమే వుంటుంది అన్నారు.

ఇది పార్టీకి సంబంధించిన సమాచార నిధి. పార్టీ సమాచారానికి, ప్రభుత్వ సమాచారానికి తేడా తెలియని వాళ్లు ప్రతిపక్ష నాయకులుగా ఉండడం మన దౌర్భాగ్యం. పబ్లిక్ డొమైన్ లో ఉన్న డేటాను ఎవరైనా వాడుకోవచ్చు. రాష్ట్రంలో ఎవరు ఎవరు ఏ పథకం ద్వారా లబ్ది పొందారనే విషయం ఆయా శాఖల ప్రభుత్వ వెబ్ సైట్లలో పొందవచ్చు. తమ సైట్లు ఎవరు హ్యాక్ చేయలేదని, ఎలక్షన్ కమీషన్ సమాచార మంతా ఓపెన్ సోర్స్ అని స్వయంగా ఎలక్షన్ కమీషనరే చెప్పారు.

ఫామ్ 7 పేరుతో జగన్ ప్రజాస్వామ్యం పైన దాడి చేస్తున్నారు. తానే ఓట్లు తొలగించమని అప్లికేషన్స్ పెట్టమన్నానని నిర్లజగ్గా ప్రచారం చేసుకుంటున్నాడు. జగన్ తీరు చూస్తుంటే తన మీద నమ్మకం కోల్పోయినట్లు వుంది. ఎలాగైనా సి.ఎం పదవి పొందాలనే ఉద్దేశంతో తప్పుడు మార్గాలు ఎంచుకుంటున్నారు. జగన్ రూపంలో ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించాలని  కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు. పోలవరం నిర్మాణం అడ్డుకోవడమే అతని లక్ష్యం.

జగన్ ని అధికారంలోకి తేవడం ద్వారా రాష్ట్రానికి రావాల్సిన ఆస్తులు, నిధులను  ఎగ్గొటవచ్చని కేసీఆర్ ఆలోచన చేస్తున్నాడు. జగన్ హైదరాబాద్ లోని తన ఆస్తులు, భవంతుల కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని కేసీఆర్ దగ్గర తాకట్టు పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీ డేటా దొంగలించేందుకు సహకరించి తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసింది. రాబోయే రోజుల్లో ఎవరో ఫిర్యాధు చేశారని, తమ డేటానూ దోచుకుంటారేమోనని హైదరాబాద్ లోని ప్రైవేటు కంపెనీలు భయపడుతున్నాయి.

తెలంగాణ ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ఇక ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్తలు తమ కంపెనీలు అడ్రస్ లు మారచుకోవాల్సిన  సమయం ఆసన్నమయిందని అనిపిస్తుంది. మిగులు బడ్జెట్ లో వున్న రాష్ట్రాన్ని కేసీఆర్ లోటు బడ్జెట్ లో పెట్టాడు. ఆయనకు రాష్ట్రాభివ్రుద్ది కన్నా రాజకీయాలు చేయడం పైనే ఎక్కువుగా దృష్టి పెట్టార‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here