Home News దోషుల‌ను వెంట‌నే అరెస్ట్ చేయాలి – చంద్ర‌బాబు ఆదేశం..!

దోషుల‌ను వెంట‌నే అరెస్ట్ చేయాలి – చంద్ర‌బాబు ఆదేశం..!

57
0


రాత్రి వివేకానంద రెడ్డి గుండె పోటుతో మరణించారని సమాచారం అందింది కానీ… పరిసరాలు చూస్తే అనుమానాస్పద మృతిగా అనిపిస్తోంద‌ని వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తెలియ‌చేసారు. వైఎస్సార్ పార్టీ కుటుంబ సభ్యులు..లోతైన దర్యాప్తు జరపాలని కోరుతున్నారు. సహజ మరణమా…? కాదా..?  దీని వెనక ఎవరన్నా ఉన్నారా..?  అనేది లోతైన దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అంత్యక్రియల్లో పాల్గొంటారు. అక్కడి పరిస్థితి మనకు తెలియదు. అందిన సమాచారం ప్రకారం అనుమానాస్పద మృతి గా అనుకుంటున్నాం. దర్యాప్తు జరపినాక.. ఏ విషయమైనా తెలుస్తుంది. వివేకానంద రెడ్డి మృతి చెందిన సందర్భంలో.. రాజకీయాలు మాట్లాడటం సరికాదు. అంత్యక్రియలు.. ఈ రోజు, లేదా రేపు జరగొచ్చు అని చెప్పారు.

 వివేకానంద రెడ్డి మృతి పై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసారు. అనుమానాస్పద మృతి వార్తల పై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఆయ‌న మాజీ మంత్రి శ్రీ వైఎస్ వివేకానంద రెడ్డి హఠాన్మరణం పట్ల  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  అప్పటికప్పుడు పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు.  డిజిపితో, ఇంటలిజెన్స్ అధికారులతో,కడప జిల్లా పోలీసు అధికారులతో మాట్లాడారు. వివేకానంద రెడ్డి మృతి పై అత్యన్నత స్థాయిలో దర్యాప్తు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

 దీని పై వెంటనే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించాలని ఆదేశించారు. దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని, నిందితులు ఏ స్థాయి వారైనా కఠినంగా శిక్షించాలని చంద్ర‌బాబు కోరారు. వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. శాసన సభలో, శాసన మండలిలో, లోక్ సభలో ప్రజా ప్రతినిధిగా వ్యవహరించారని అన్నారు. ఎంపిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా దీర్ఘకాలం సేవలు అందించారన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here