Home Political News ద‌క్షిణ భార‌త్ నాడి ప‌ట్ట‌డంలో జాతీయమీడియా విఫ‌లం – కాంగ్రెస్ నేత కుసుమ కుమార్.

ద‌క్షిణ భార‌త్ నాడి ప‌ట్ట‌డంలో జాతీయమీడియా విఫ‌లం – కాంగ్రెస్ నేత కుసుమ కుమార్.

106
0

తెలంగాణ‌లో ఎన్నిక‌లు ముగిసాయి. ఇక తేలాల్సింది ఫ‌లితాలు. అయితే… ఒక్కొ స‌ర్వే ఒక్కొలా చెబుతుంది. ఎక్కువ స‌ర్వేలు టీఆర్ఎస్ కి అనుకూలంగా ఉంటే…ల‌గ‌డ‌పాటి స‌ర్వే మాత్రం మ‌హా కూట‌మికి అనుకూలాంగా ఉంది. దీంతో టీఆర్ఎస్ కి ఎన్ని సీట్లు వ‌స్తాయి..?  మ‌హాకూట‌మికి ఎన్ని సీట్లు వ‌స్తాయి..? అనేది ఆస‌క్తిగా మారింది. పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ తెలంగాణ ఎన్నిక‌ల గురించి స్పందిస్తూ…కాంగ్రెస్ కు 60కి పైగా స్ధానాలు వ‌స్తాయ‌ని…మ‌హా కూట‌మికి 80కి పైగా సీట్లు వ‌స్తాయ‌ని చెప్పారు.

ద‌క్షిణ భార‌త్ నాడి ప‌ట్టుకోవ‌డంలో జాతీయ మీడియా ఎప్పుడూ విఫ‌ల‌మైంద‌ని అన్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ ఖాళీ చేయ‌డానికి కేసీఆర్ ముహుర్తం చూసుకుంటే మంచిద‌ని… ఓటమి భయంతోనే టీఆర్ఎస్ నేతలు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఈవీఎంలు ఉన్నచోట కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని కుసుమకుమార్ సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here