Home Uncategorized ద‌స‌రా బ‌రిలో రామ్ మూవీ..!

ద‌స‌రా బ‌రిలో రామ్ మూవీ..!

136
0
Ram movie release date

ఈ ద‌స‌రాకి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తోన్న అర‌వింద స‌మేత వీర రాఘ‌వ సినిమా రిలీజ్ చేయ‌నున్నారు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. అయితే..ద‌స‌రాకి ఎన్టీఆర్ సినిమా ఒక్క‌టే వ‌స్తుంది అనుకుంటే..ఇప్పుడు రామ్ మూవీ హ‌లో గురు ప్రేమ కోస‌మే కూడా ద‌స‌రాకి వ‌స్తుంద‌ని చిత్ర నిర్మాణ సంస్థ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసింది. రామ్ హీరోగా న‌క్కిన త్రినాథ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో హ‌లో గురు ప్రేమ కోస‌మే చిత్రం రూపొందుతోంది.

ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. నాగార్జున – నాని క‌లిసి న‌టిస్తోన్న దేవ‌దాస్ సెప్టెంబ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఇక నాగ చైత‌న్య శైల‌జారెడ్డి అల్లుడు, స‌వ్య‌సాచి ఈ రెండు చిత్రాల్లో ఏదో ఒక చిత్రం అక్టోబ‌ర్ లో రావ‌డం ఖాయం. ఇక ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తోన్న ర‌జ‌నీకాంత్ 2.0 చిత్రాన్ని న‌వంబ‌ర్ 29న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు శంక‌ర్ ఎనౌన్స్ చేసారు. దీంతో దిల్ రాజు రామ్ మూవీ హ‌లో గురు ప్రేమ కోస‌మే చిత్రాన్ని అక్టోబ‌ర్ 18న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ఎనౌన్స్ చేసారు.

ఎన్టీఆర్ అర‌వింద స‌మేత అక్టోబ‌ర్ 11న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్టు స‌మాచారం. అంటే..ఎన్టీఆర్ మూవీ వ‌చ్చిన వారానికి రామ్ సినిమా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here