Home Actor నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ టైటిల్ మారిందా..?

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ టైటిల్ మారిందా..?

50
0
నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ టైటిల్ మారిందా..? spiceandhra

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఇటీవ‌ల వేగేశ్న స‌తీష్ తో ఓ సినిమాని ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాతో పాటు నూత‌న ద‌ర్శ‌కుడు మ‌ల్లిడి వ‌శిష్ట్ తో కూడా క‌ళ్యాణ్ రామ్ సినిమా చేయ‌నున్నారు. ఈ సినిమాకి తుగ్ల‌క్ అనే టైటిల్ ఖ‌రారు చేసార‌ని వార్త‌లు వ‌చ్చాయి కానీ..ఈ టైటిల్ క‌థ‌కు త‌గ్గ‌ట్టుగా ప‌వ‌ర్ ఫుల్ గా  లేద‌ని భావించి మార్చాలి అనుకుంటున్నార‌ట‌.

క‌థ‌కి త‌గ్గ‌ట్టుగా ప‌వ‌ర్ ఫుల్ టైటిల్ పెట్టాల‌ని ఆలోచించి….ఆఖ‌రికి రావ‌ణ అనే టైటిల్ పెట్టాల‌నే నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలిసింది. ఈ టైటిల్ ఖ‌రారు చేయ‌డానికి కార‌ణం ఏంటంటే… జై ల‌వ‌కుశ సినిమాలో రావ‌ణ సాంగ్ ఎంత పాపుల్ అయ్యిందో తెలిసిందే. ఎన్టీఆర్ పోషించిన రావ‌ణ క్యారెక్ట‌ర్ కూడా అంత బాగా ఆడియ‌న్స్ కి క‌నెక్ట్ అయ్యింది. దీనిని దృష్టిలో పెట్టుకుని రావ‌ణ టైటిల్ ఫిక్స్ చేసార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌ర‌గుతోంది. ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ అంద‌రూ ఫైన‌ల్ అయిన త‌ర్వాత ఈ సినిమాని అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేస్తార‌ని స‌మాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here