Home Movie News నంద‌మూరి హ‌రికృష్ణ మ‌ర‌ణం – విషాదంలో నంద‌మూరి కుటుంబం.!

నంద‌మూరి హ‌రికృష్ణ మ‌ర‌ణం – విషాదంలో నంద‌మూరి కుటుంబం.!

98
0
Nandhamuri hari krishna died

నంద‌మూరి హ‌రికృష్ణ (62) ఈరోజు ఉద‌యం జ‌రిగిన రోడ్డు ప్ర‌మాధంలో మ‌ర‌ణించారు. ఆయ‌న ఓ పెళ్లి వేడుక‌కు హాజ‌ర‌య్యేందుకు ఉద‌యం త‌న నివాసం నుంచి నెల్లూరు బ‌య‌లుదేరారు. న‌ల్గొండ స‌మీపంలోని అన్నేప‌ర్తి వ‌ద్ద ఆయ‌న‌ ప్ర‌యాణిస్తున్న కారు బోల్తా ప‌డ‌డంతో తీవ్ర గాయాల‌య్యాయి. వెంట‌నే నార్క‌ట్ ప‌ల్లిలోని కామినేని హాస్ప‌ట‌ల్ కి తీసుకెళ్లారు. అక్క‌డ ఆయ‌న చికిత్స‌ పొందుతూ మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు తెలియ‌చేసారు.

ప్ర‌మాదం జ‌రిగిన ప‌ది నిమిషాల్లోనే హాస్ప‌ట‌ల్ కి తీసుకెళ్లారు.  వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు. ఈ వార్త తెలుసుకున్న వెంట‌నే హరికృష్ణ తనయులు ఎన్టీఆర్‌, కళ్యాణ్ రామ్ హుటాహుటిన కామినేని ఆస్పత్రికి బయలుదేరారు.  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్‌ తమ కార్యక్రమాలను రద్దు చేసుకొని ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు బయలుదేరారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కెసిఆర్, ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు హ‌రికృష్ణ మ‌ర‌ణం ప‌ట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తూ సంతాపం తెలియ‌చేసారు.

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here