Home Movie News నాకు బాగా ఇష్ట‌మైన పాత్ర అదే – హీరో రామ్..!

నాకు బాగా ఇష్ట‌మైన పాత్ర అదే – హీరో రామ్..!

105
0

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ – స‌క్సస్ ఫుల్ డైరెక్ట‌ర్ త్రినాధ‌రావు న‌క్కిన కాంబినేష‌న్ లో రూపొందిన చిత్రం హ‌లో గురు ప్రేమ కోస‌మే. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మించారు. రామ్ – అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా న‌టించిన ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందించారు. ద‌స‌రా కానుక‌గా ఈ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ ఈ నెల 18న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా హీరో రామ్ మాట్లాడుతూ…ఈ సినిమాలో విలేజ్ నుంచి సిటీకి వచ్చిన కుర్రాడిగా… సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపిస్తాను.

దర్శకుడు త్రినాథరావు .. రచయిత ప్రసన్నకుమార్ నా పాత్రను అద్భుతంగా మలిచారు. ఇప్పటివరకూ నేను చాలా పాత్రలు పోషించాను. నాకు ఇష్టమైన పాత్ర ఏదంటే మాత్రం ఈ పాత్రేనని చెబుతాను. ఈ పాత్రను చేస్తున్నప్పడు నేను ఎంతో ఎంజాయ్ చేశాను. ఇంతవరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్ తో సినిమా ఉంటుంది. ఈ పాయింట్ ని ఈ యాంగిల్ లోకూడా చూడ‌చ్చా అనేలా ఈ సినిమా ఉంటుంది.  తప్పకుండా సక్సెస్ లభిస్తుందనే నమ్మకం వుంది అన్నారు.

త‌దుప‌రి చిత్రాల గురించి మాట్లాడుతూ… ప్ర‌వీణ్ స‌త్తారుతో సినిమా చేయాల‌నుకున్నాను కానీ…కొన్ని కార‌ణాల వ‌ల‌న ఆ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. భ‌విష్య‌త్ లో ప్ర‌వీణ్ తో ఖ‌చ్చితంగా సినిమా చేస్తాను అన్నారు. పూరితో రామ్ సినిమా ఉంటుంది అని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదే విష‌యం గురించి రామ్ ని అడిగితే..పూరి గారితో ఎప్ప‌టి నుంచో సినిమా చేయాల‌నుకుంటున్నాను. మా ఇద్ద‌రి మ‌ధ్య చాలా రోజుల నుంచి క‌థా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. కానీ..స్టోరీ సెట్ కాలేదు. మంచి స్టోరీ సెట్ అయితే పూరి గారితో సినిమా ఉంటుంది అని చెప్పారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here