Home Actor నాగార్జున‌, త్రివిక్ర‌మ్ మ‌ధ్య ఏం జ‌రిగింది.?  ప్ర‌చారంలో ఉన్న‌ వార్త‌లు నిజ‌మేనా..?

నాగార్జున‌, త్రివిక్ర‌మ్ మ‌ధ్య ఏం జ‌రిగింది.?  ప్ర‌చారంలో ఉన్న‌ వార్త‌లు నిజ‌మేనా..?

43
0
నాగార్జున‌, త్రివిక్ర‌మ్ మ‌ధ్య ఏం జ‌రిగింది.? ప్ర‌చారంలో వార్త‌లు నిజ‌మేనా..? spiceandhra

టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్ లో మ‌ర‌చిపోలేని చిత్రాల్లో ఒక‌టి మ‌న్మ‌థుడు. ఈ చిత్రానికి క‌థ – మాటలు త్రివిక్ర‌మ్ అందించ‌గా… విజ‌య్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాలో పంచ్ లు ఎలా పేలాయో.. ప్రేక్ష‌కులు ఎంత‌గా ఎంజాయ్ చేసారో అంద‌రికీ తెలిసిందే. ఈ స‌క్స‌స్ ఫుల్ మూవీ ఇంత‌టి విజ‌యాన్ని సాధించ‌డానికి త్రివిక్ర‌మ్ క‌థ – మాట‌లు కారణ‌మ‌ని అందరికీ తెలిసిందే.

అయితే… మ‌న్మ‌థుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున‌ మాట్లాడుతూ.. మ‌న్మ‌థుడు సినిమాలో పంచ్ లు అంత‌గా పేలాయి అంటే కార‌ణం విజ‌య్ భాస్క‌ర్ గారే అని చెప్పారు. త్రివిక్ర‌మ్ గురించి అస‌లు మాట్లాడ‌లేదు. మ‌న్మ‌థుడు క్రెడిట్ అంతా విజ‌య్ భాస్క‌ర్ గారిదే అన్నారు. దీనిని బ‌ట్టి త్రివిక్ర‌మ్ కి నాగ్ కి మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రిగాయా..?  అందువ‌ల‌నే నాగ్ ఇలా మాట్లాడారా..? అనే అనుమానాలు మొద‌ల‌య్యాయి.

కొన్ని వెబ్ సైట్స్ లో ఈ వార్త‌లు రాయ‌డం కూడా జరిగింది. అయితే… ఈ రోజు మీడియాతో మాట్లాడిన నాగార్జున‌ను ఇదే విష‌యం గురించి అడిగితే… త‌న‌కు మ‌న్మ‌ధుడు క‌థ, డైలాగులు  చెప్పింది విజ‌య్ భాస్క‌ర్ గారు అని చెప్పారు. నెక్ట్స్ క్వ‌చ్ఛ‌న్ ఏంటి అంటూ ఈ టాపిక్ గురించి ఎక్కువుగా మాట్లాడ‌డం ఇష్టం లేద‌నే విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పేసారు. సో… వీరిద్ద‌రి మ‌ధ్య ఏదో జ‌రిగింది అనేది నిజ‌మే అనిపిస్తుంది. అయితే.. ఏం జరిగింది అనేదే తెలియాల్సివుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here