Home Actor నాగ్ అశ్విన్ నెక్ట్స్ మూవీ ఎవ‌రితో..?

నాగ్ అశ్విన్ నెక్ట్స్ మూవీ ఎవ‌రితో..?

37
0
నాగ్ అశ్విన్ నెక్ట్స్ మూవీ ఎవ‌రితో..? spiceandhra

ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై… తొలి చిత్రంతోనే విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న యువ ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్. ఆత‌ర్వాత అల‌నాటి న‌టి సావిత్రి జీవిత క‌థ‌ను మ‌హాన‌టి టైటిల్ తో  అద్భుతంగా తెర‌కెక్కించి బ్లాక్ బ‌ష్ట‌ర్ సొంతం చేసుకుని శ‌భాష్ అనిపించుకున్నారు. వైజ‌యంతీ మూవీస్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాలో సావిత్రి పాత్ర‌ను కీర్తి సురేష్ అద్భుతంగా పోషించి మెప్పించింది.

ఇదిలా ఉంటే… మ‌హాన‌టి సినిమా చూసిన చిరంజీవి నాగ్ అశ్విన్ ని అభినందించి…అత‌నితో సినిమా చేయాల‌నుకుంటున్నాను అని చెప్పారు. దీంతో నాగ్ అశ్విన్ త‌దుప‌రి చిత్రం చిరంజీవితో ఉంటుందని ప్ర‌చారం జ‌రిగింది కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ప్రాజెక్ట్ గురించి క్లారిటీ లేదు. చిరంజీవి ప్ర‌స్తుతం సైరా న‌ర‌సింహారెడ్డి చేస్తున్నారు. ఈ సినిమా అక్టోబ‌ర్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.

ఈ సినిమా త‌ర్వాత బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో సినిమా చేయ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఈ మూవీ త‌ర్వాత చిరంజీవి త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తో సినిమా చేయాల్సివుంది. అందుచేత ఇప్ప‌ట్లో నాగ్ అశ్విన్ తో చిరంజీవి సినిమా ఉండ‌క‌పోవ‌చ్చు. దీంతో.. నాగ్ అశ్విన్ నెక్ట్స్ మూవీ ఎవ‌రితో ఉంటుంది అనేది ఆస‌క్తిగా మారింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here