Home Telugu నాగ్ ఆఫీస‌ర్ ట్రైల‌ర్ వ‌చ్చింది..ఇదైనా ఆక‌ట్టుకుందా..?

నాగ్ ఆఫీస‌ర్ ట్రైల‌ర్ వ‌చ్చింది..ఇదైనా ఆక‌ట్టుకుందా..?

123
0

టాలీవుడ్ కింగ్ నాగార్జున – సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ కాంబినేష‌న్లో రూపొందిన తాజా చిత్రం ఆఫీస‌ర్. దాదాపు 25 సంవ‌త్స‌రాల త‌ర్వాత నాగ్ – వ‌ర్మ క‌లిసి సినిమా చేస్తుండ‌డంతో శివ మ్యాజిక్ మ‌ళ్లీ రిపీట్ చేస్తారా..?  మ‌రోసారి ట్రెండ్ సెట్ చేస్తారా..?  అనే క్యూరియాసిటీ ఏర్ప‌డింది.  అయితే…ఈ సినిమా నిర్మాణంలో ఉండ‌గానే..వ‌ర్మ జీఎస్టీ అంటూ వివాద‌స్ప‌ద చిత్రం తీసి మ‌రోసారి వార్త‌ల్లోకి నిలిచాడు. ఓ వైపు నాగార్జున‌తో సినిమా చేస్తుండ‌గా…ఆ సినిమా పై దృష్టి పెట్ట‌కుండా… జీఎస్టీ (గాడ్, సెక్స్, ట్రూత్) తీయ‌డంతో నాగ్ మూవీ పై వ‌ర్మ‌ ఎంత కాన్ స‌న్ ట్రేష‌న్ చేస్తున్నాడో అర్ధం అవుతోంది అంటూ విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

వ‌ర్మ‌కి నాగార్జున ఈ టైమ్ లో అవ‌కాశం ఇవ్వ‌డ‌మే గొప్ప‌. అలాంటిది ఇచ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుని ఓ మాంచి స‌క్స‌స్ ఫుల్ మూవీ తీద్దాం అనే క‌సి వ‌ర్మ‌లో క‌నిపించ‌డం లేదు. వ‌ర్మ‌ ఎవ‌రితోనైనా సినిమా తీయాల‌నుకుంటే…వాళ్ల‌ని ఎలా ఒప్పించాలి అనే విష‌యం పై బాగా దృష్టి పెడ‌తాడు. అర‌చేతిలో స్వ‌ర్గం చూపించిన‌ట్టు…త‌న మాట‌ల‌తో ఏదోలా మాయ చేసి ఒప్పిస్తాడు. ఆత‌ర్వాత సినిమా తీయ‌డం పై దృష్టి పెట్ట‌డ‌నిపిస్తోంది.

ఆఫీస‌ర్ టీజ‌ర్ రిలీజ్ చేసారు. ఫ‌ర‌వాలేద‌నిపించింది కానీ…ఆశించిన స్ధాయిలో ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది. నాగ్ ఫ్యాన్స్ సైతం..ఏంటి ఈ ట్రైల‌ర్..?  అంటూ డీలాప‌డిపోయారు. ఇది గ‌మనించిన ఆఫీస‌ర్ టీమ్ సెకండ్ టీజ‌ర్ అంటూ మ‌రో టీజ‌ర్ రిలీజ్ చేసారు. ఇది కూడా పెద్ద గొప్ప‌గా ఏం లేదు.  ఈ సినిమాని మే 25న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు అఫిషియ‌ల్ గా  ఎనౌన్స్ చేసారు. కానీ..ఆడియ‌న్స్ లో ఆఫీస‌ర్ పై అటెన్ష‌న్ క్రియేట్ కాలేదు.

ఇలాంటి టైమ్ లో వ‌ర్మ శ్రీరెడ్డితో ప‌వ‌న్ ని తిట్టించ‌డం..ఆ విష‌యాన్ని స్వ‌యంగా వ‌ర్మ బ‌య‌ట‌పెట్ట‌డం..ఆత‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాలు గురించి తెలిసిందే. దీంతో వ‌ర్మ పై ప‌వ‌న్ ఫ్యాన్స్ మాత్ర‌మే కాకుండా కామ‌న్ ఆడియ‌న్స్ సైతం కోపంగా ఉన్నారు. ఇండ‌స్ట్రీలో అయితే…వ‌ర్మ‌ని బ‌హిష్క‌రించాలి అనేంత వ‌ర‌కు వెళ్లింది వ్య‌వ‌హారం. ఇలాంటి టైమ్ లో ఆఫీస‌ర్ రిలీజ్ కావ‌డం అనేది పెద్ద మైన‌స్. రెండు టీజ‌ర్ లు రిలీజ్ చేసినా రావాల్సిన బ‌జ్ క్రియేట్ కాక‌పోవ‌డంతో తాజాగా ఆఫీస‌ర్ ట్రైల‌ర్ రిలీజ్ చేసారు.

ఈ ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే…రెండు టీజ‌ర్ లును క‌లిపి ఓకేసారి రిలీజ్ చేసారా అన్న‌ట్టుగా ఉంది ఈ ట్రైల‌ర్. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుంది కానీ..25న ఆఫీస‌ర్ వ‌స్తున్నాడా..?  రావ‌డం లేదా..?  అనేది క్లారిటీ లేదు.  ఎప్పుడు వ‌చ్చినా…ఆఫీస‌ర్ పై పెద్ద‌గా అంచ‌నాలు లేవు. ఇది ఆఫీస‌ర్ కి క‌లిసొచ్చే అంశ‌మే. ఎందుకంటే….అంచ‌నాలు లేవు కాబ‌ట్టి ఏమాత్రం కాస్త బాగున్నా స‌క్స‌స్ అవ్వ‌డానికి ఛాన్స్ ఉంటుంది. మ‌రి…ఆఫీస‌ర్ ఏం చేస్తాడో చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here