Home Actor నాగ్ – చైతుల బంగార్రాజు లేటెస్ట్ అప్ డేట్..?

నాగ్ – చైతుల బంగార్రాజు లేటెస్ట్ అప్ డేట్..?

33
0
నాగ్ - చైతుల బంగార్రాజు లేటెస్ట్ అప్ డేట్..? spiceandhra

అక్కినేని నాగార్జున కెరీర్ లో ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని చిత్రాల్లో ఒక‌టి సొగ్గాడే చిన్ని నాయ‌నా. క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా 50 కోట్ల‌కు పైగా షేర్ సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.  ఈ సినిమా ఇచ్చిన విజ‌యంతో సీక్వెల్ తీయాల‌ని.. ఆ మూవీకి బంగార్రాజు టైటిల్ పెట్టాల‌ని నాగ్ అప్పుడే ఫిక్స్ అయ్యారు. ఈ టైటిల్ ని రిజిష్ట‌ర్ కూడా చేయించారు.

గ‌త కొంత కాలంగా బంగార్రాజు వార్త‌ల్లో ఉంటుంది కానీ.. ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది అనేది మాత్రం క్లారిటీ లేదు. మ‌న్మ‌థుడు 2 షూటింగ్ పూర్తి చేసిన నాగ్ జులై నుంచి బంగార్రాజు షూటింగ్ స్టార్ట్ చేస్తారు అనుకున్నారు. అయితే.. నాగ్ ప్ర‌స్తుతం బిగ్ బాస్ 3 లో బిజీగా ఉన్నారు. మూడు నెల‌ల పాటు బిగ్ బాస్ 3 ఉంటుంది. మ‌రో వైపు నాగ చైత‌న్య వెంకీ మామ సినిమా చేస్తున్నాడు.

సెప్టెంబ‌ర్ నుంచి శేఖ‌ర్ క‌మ్ముల సినిమా స్టార్ట్ చేయ‌నున్నాడు. ఈ రెండు సినిమాల‌తో చైత‌న్య బిజీ. అందుచేత సంక్రాంతికి వ‌స్తాడ‌నుకున్న బంగార్రాజు రావ‌డం లేద‌ని తెలిసింది. నాగ్ – చైతు ప్ర‌స్తుతం ఓకే చేసిన ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిన త‌ర్వాత బంగార్రాజు స్టార్ట్ చేస్తార‌ట‌. ఈ ఇయ‌ర్ ఎండింగ్ లో స్టార్ట్ చేసి స‌మ్మ‌ర్ కి రిలీజ్ చేస్తార‌ని స‌మాచారం.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here