Home Movie News నాగ్, చైతు, అఖిల్ రిలీజ్ లు ఆగిపోయాయి..!

నాగ్, చైతు, అఖిల్ రిలీజ్ లు ఆగిపోయాయి..!

101
0
nag chay akhil

అక్కినేని నాగార్జున – నాని కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ దేవ‌దాస్. ఈ చిత్రానికి యువ ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పై అశ్వ‌నీద‌త్ నిర్మిస్తోన్న ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ కి ట్రెమండ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈరోజు ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్ చేయాల‌నుకున్నారు. అయితే..నంద‌మూరి హ‌రికృష్ణ చ‌నిపోవ‌డంతో దేవ‌దాస్ ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్ క్యాన్సిల్ చేసారు. అలాగే అక్కినేని నాగ చైత‌న్య న‌టించిన శైల‌జారెడ్డి అల్లుడు మూవీ ట్రైల‌ర్ ను కూడా ఈరోజు రిలీజ్ చేయాల‌నుకున్నారు.

ఈ ట్రైల‌ర్ రిలీజ్ కూడా క్యాన్సిల్ చేసారు. ఈరోజు అక్కినేని అఖిల్ కూడా త‌ను న‌టిస్తోన్న మూడ‌వ సినిమా ఫ‌స్ట్ లుక్ ను రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి స‌ర్ ఫ్రైజ్ గిఫ్ట్ లా ఇవ్వాల‌నుకున్నాడు. తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ చిత్రానికి మిస్ట‌ర్ మ‌జ్ను అనే టైటిల్ ఖరారు చేసార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఫ‌స్ట్ లుక్ & టైటిల్ ఎనౌన్స్ మెంట్ కూడా క్యాన్సిల్ చేసారు. నాగ్ మూవీ దేవ‌దాస్ ఫ‌స్ట్ సాంగ్, చైతు శైల‌జారెడ్డి అల్లుడు  ట్రైల‌ర్, అఖిల్ థ‌ర్డ్ మూవీ టైటిల్ & ఫ‌స్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ చేయ‌నున్నారో త్వ‌ర‌లోనే ఎనౌన్స్ చేయ‌నున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here