Home Telugu నాగ్ – నానిల దేవ‌దాస్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

నాగ్ – నానిల దేవ‌దాస్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

157
0
Nag Nani Devdas

టాలీవుడ్ కింగ్ నాగార్జున – నేచుర‌ల్ స్టార్ నాని కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ దేవ‌దాస్. ఈ సినిమాని వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ పై అశ్వ‌నీద‌త్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇందులో నాగ్ డాన్ గా న‌టిస్తుంటే..నాని డాక్ట‌ర్ గా న‌టిస్తున్నాడు. ఇటీవ‌ల దేవ‌దాస్ టైటిల్ ఎనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్ట‌ర్ కి అనూహ్య‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు అర‌వై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

నాగార్జున ప్ర‌స్తుతం బాలీవుడ్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. అమితాబ్, ర‌ణ‌బీర్ క‌పూర్ ల‌తో న‌టిస్తోన్న ఈ చిత్రం బ‌ల్గేరియాలో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ వారంలో నాగార్జున ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటారని తెలిసింది.  ఇక నానితో చేస్తోన్న దేవ‌దాస్ ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 27న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ మ‌ల్టీస్టార‌ర్ పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. మ‌రి..దేవ‌దాస్ అంచ‌నాల‌ను అందుకుని సంచ‌ల‌నం సృష్టిస్తాడ‌ని ఆశిద్దాం..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here