Home Telugu నాగ్ – నాని మూవీకి ఆ టైటిల్ పెడుతున్నారా..?

నాగ్ – నాని మూవీకి ఆ టైటిల్ పెడుతున్నారా..?

176
0
Nag -Nani movie title

టాలీవుడ్ కింగ్ నాగార్జున – నేచుర‌ల్ స్టార్ నాని కాంబినేష‌న్ లో భారీ మ‌ల్టీస్టార‌ర్ రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాని వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పై అశ్వ‌నీద‌త్ నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇందులో నాగ్ డాన్ గా న‌టిస్తుంటే…నాని డాక్ట‌ర్ గా న‌టిస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు అర‌వై శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇదిలా ఉంటే…ఈ సినిమాకి దేవ‌దాసు అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టుగా టాక్ వినిపిస్తోంది. దేవ‌దాసు సినిమా అక్కినేని నాగేశ్వ‌ర‌రావు కెరీర్ లోనే కాకుండా తెలుగు చ‌ల‌న చిత్ర చ‌రిత్ర‌లో ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని చిత్రం. దేవ‌దాసుగా ఎంత మంది న‌టించినా…అక్కినేనిలా మాత్రం న‌టించ‌లేక‌పోయార‌నే విషయం అందరికీ తెలిసిందే. అయితే..పాత టైటిల్స్ ను కొత్త‌ చిత్రాల‌కు పెట్ట‌డం నాగార్జున‌కు అంత‌గా ఇష్టం ఉండ‌దు. గ‌తంలో కోన నిర్మించిన హ‌ర్ర‌ర్ మూవీకి గీతాంజ‌లి అనే టైటిల్ పెట్టిన‌ప్పుడు నాగ్ కి కోపం వ‌చ్చింది.

ఈ విష‌యాన్ని నాగ్ స్వ‌యంగా మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు ప్రొగ్రామ్ లో చెప్పారు. మ‌రి..ఇప్పుడు తెలుగు సినిమా చ‌రిత్ర‌లో క్లాసిక్ గా నిలిచిన తన తండ్రి టైటిల్ ను ఈ మ‌ల్టీస్టార‌ర్ కి పెట్టేందుకు నాగ్ ఓకే చెబుతారా..?  అస‌లు ఈ టైటిల్ ను చిత్ర యూనిట్ ప‌రిశీలిస్తుందా..?  లేక పుకారా..?  అనేది క్లారిటీ రావాలంటే కొన్నిరోజులు వెయిట్ చేయాల్సిందే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here