Home Actor నాగ్ మ‌న‌సుదోచుకున్న వెన్నెల కిషోర్.

నాగ్ మ‌న‌సుదోచుకున్న వెన్నెల కిషోర్.

126
0
నాగ్ మ‌న‌సుదోచుకున్న వెన్నెల కిషోర్. spiceandhra

టాలీవుడ్ కింగ్ నాగార్జున న‌టించిన తాజా చిత్రం మ‌న్మ‌థుడు 2. చి.ల‌.సౌ ఫేమ్ రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మ‌న్మ‌థుడు 2 ఈ నెల 9న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ మూవీ ట్రైల‌ర్ & సాంగ్స్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న నాగార్జున ఈ సినిమాను గురించి మాట్లాడుతూ… ఫ్యామిలీ అంతా క‌లిసి చూసి బాగా ఎంజాయ్ చేసే సినిమా ఇది. అంద‌రికీ ఖ‌చ్చితంగా న‌చ్చుతుంద‌న్నారు.  ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రను పోషించిన వెన్నెల కిషోర్ గురించి చెబుతూ…వెన్నెల కిషోర్ ఎంతో టాలెంట్ వున్న యాక్టర్. ఈ సినిమాకి ఆయన వెన్నెల వంటివాడు.

సెట్స్ లో వెన్నెల కిషోర్ ఎప్పుడూ సరదాగా ఉంటూ సందడి చేసేవాడు. కిషోర్ వేసిన జోకులకి ఎన్నిసార్లు నవ్వుకున్నామో. నేను మన్మథుడు సినిమా చేస్తున్నప్పుడు ఎంతగా నవ్వుకుంటూ చేసానో, వెన్నెల కిషోర్ కారణంగా మ‌ళ్లీ ఇప్పుడు ఈ సినిమా కూడా అంతగానే నవ్వుతూ చేశాను. వెన్నెల కిషోర్ ను నేను చాలా మిస్ అవుతున్నాను  అని నాగ్ చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here