Home Telugu నాగ్ – వ‌ర్మల‌ ఆఫీస‌ర్ రిలీజ్ ఆగింది..!

నాగ్ – వ‌ర్మల‌ ఆఫీస‌ర్ రిలీజ్ ఆగింది..!

112
0

సెల్యూలాయిడ్ సైంటిస్ట్ నాగార్జున – సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ కాంబినేష‌న్లో రూపొందిన తాజా చిత్రం ఆఫీస‌ర్. దాదాపు 25 సంవ‌త్స‌రాల త‌ర్వాత నాగ్ – వ‌ర్మ క‌లిసి సినిమా చేస్తుండ‌డంతో ఈ ప్రాజెక్ట్ పై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇందులో నాగార్జున ప‌వ‌ర్ ఫుల్ పోలీసాఫీస‌ర్ గా న‌టించారు. ఇటీవ‌ల ఆఫీస‌ర్ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ రిలీజ్ చేసారు. ఇక మూవీని ఈనెల 25న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు గ‌తంలో ప్ర‌క‌టించారు.

అయితే…రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతున్నా…అఫిషియ‌ల్ ఎనౌన్స్ మెంట్ రాక‌పోవ‌డంతో ఆఫీస‌ర్ రిలీజ్ వాయిదా ప‌డ‌నుంది అంటూ ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు ఈ ప్ర‌చారం నిజ‌మే అని తెలియ‌చేసేలా…ఆఫీస‌ర్ చిత్రాన్ని ఈనెల 25న రిలీజ్ చేయ‌డం లేదు. జూన్ 1న రిలీజ్ చేయ‌నున్నాం అని రామ్ గోపాల్ వ‌ర్మ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. నాగార్జున త‌ను న‌టించిన సినిమాలైనా, త‌న‌యులు చైత‌న్య‌, అఖిల్ న‌టించిన సినిమాలైనా స‌రే…బాగా రాలేదు కొన్ని మార్పులు చేస్తే… బాగుంటుంది అనుకుంటే…రీషూట్ చేయ‌డానికి ఏమాత్రం వెన‌కాడ‌రు.

ఇప్పుడు ఆఫీస‌ర్ వాయిదా ప‌డడంతో క్వాలిటీ ఉన్న కంటెంట్ అందించాల‌నే ఉద్దేశ్యంతోనే నాగార్జున ఈ నిర్ణ‌యం తీసుకుని ఉంటార‌ని టాక్ వినిపిస్తోంది. అమితాబ్ ఈ ట్రైల‌ర్ ను త‌న ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసారు. దీనికి నాగ్ & వ‌ర్మ స్పందిస్తూ… ఆఫీస‌ర్ మూవీని మీకు చూపించాల‌ని ఆతృత‌గా ఉంద‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here