Home Actor నాగ‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తా – శివాజీరాజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

నాగ‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తా – శివాజీరాజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

68
0


మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌లు ఇటీవ‌ల జ‌ర‌గ‌డం..శివాజీరాజా పై న‌రేష్ గెల‌వ‌డం తెలిసిందే. ఎన్నిక‌ల నేప‌ధ్యంలో ఒక‌రి పై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకోవ‌డంతో వివాద‌స్ప‌ద‌మైంది. ఎన్నిక‌లు అనంత‌రం వివాదం ముగిసింది అనుకుంటే…మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు న‌రేష్..ప్రెస్ మీట్ పెట్టి శివాజీరాజా మా ప‌నులు చేయ‌నివ్వ‌డం లేదు. మా సీటు వ‌ద‌ల‌డం లేదు అని తెలియ‌చేసారు. దీంతో ముగిసింది అనుకున్న వివాదం మ‌ళ్లీ మొద‌ట‌కొచ్చింది.

ఈ రోజు శివాజీరాజా ప్రెస్ మీట్ పెట్టి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డంతో ఈ వివాదం మ‌రింత ముదిరింది. ఇంత‌కీ శివాజీరాజా ఏమ‌న్నారంటే…బైలా ప్రకారం ఏప్రిల్‌లో ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పాను. గతంలో నేను కూడా 25 రోజులు ఆగి ప్రమాణం చేశాను అంతే కానీ..వారి ప్రమాణం సీక్వారం పై నేను కోర్టుకు వెళతానని చెప్పలేదు అన్నారు. గత 22 ఏళ్లుగా మాలో ఎన్నో పదువుల్లో సేవ చేశాను.  ఈసీ మెంబర్‌ నుంచి అధ్యక్షుడి వరకు అన్ని బాధ్యతలు నిర్వహించాను.

ఇప్పుడు మా అధ్య‌క్ష‌ కుర్చీ మీద వ్యామోహం లేదు. కానీ… నరేష్‌ వర్గం ప్రెస్‌మీట్ పెట్టి మా పరువు బజారు కీడ్చటం బాధ కలిగించింది. అందుకే  మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. అమెరికా ఈవెంట్ సందర్భంగా అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు చేయటం సరికాదు. ఆ ఈవెంట్ పై చిరంజీవి అధ్యక్షతన వేసిన కమిటీ క్లీన్‌ చీట్‌ ఇచ్చింది. అయినా అవ‌క‌త‌వ‌క‌లు జరిగాయ‌ని ఆరోప‌ణ‌లు చేయ‌డం అంటే చిరంజీవి గార్ని అవ‌మానించిన‌ట్టే అన్నారు.

ఎన్నికల కొద్ది రోజుల ముందు నాగబాబు ప్రెస్‌మీట్ పెట్టి నరేష్ ప్యాన‌ల్ కి మద్దుతు ఇచ్చారు. నాగ‌బాబుకు నాకు 30 ఏళ్ల స్నేహం ఉంది. నాకు గిఫ్ట్ ఇచ్చాడు. త్వరలోనే నేను రిటర్న్‌ గిఫ్ట్ ఇస్తా అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here