Home Actor నాగ‌శౌర్య మూవీకి వెరైటీ టైటిల్..!

నాగ‌శౌర్య మూవీకి వెరైటీ టైటిల్..!

71
0


యువ హీరో నాగ శౌర్య – యువ ద‌ర్శ‌కుడు అవ‌స‌రాల శ్రీనివాస్ కాంబినేష‌న్ లో ఓ వైవిధ్య‌మైన చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో నాగ‌శౌర్య స‌ర‌స‌న మాళ‌వి నాయ‌ర్ న‌టిస్తోంది. ఓ వైపు న‌టుడుగా విభిన్న‌మైన పాత్ర‌లు పోషిస్తూనే..మ‌రో వైపు వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌ను అందిస్తున్నాడు అవ‌స‌రాల శ్రీనివాస్. అలాగే త‌న చిత్రాల‌కు త‌న‌దైన శైలిలో ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద..ఇలా తెలుగుద‌నం ఉట్టిప‌డేలా టైటిల్స్ పెడుతుంటారు.

నాగ‌శౌర్య‌తో తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రానికి ఫ‌లానా అబ్బాయి ఫ‌లానా అమ్మాయి అనే టైటిల్ ఖ‌రారు చేసిన‌ట్టు స‌మాచారం. ఓ వైపు యూత్, మ‌రో వైపు ఫ్యామిలీ ఆడియ‌న్స్ ఆక‌ట్టుకునేలా అవ‌స‌రాల శ్రీనివాస్ సినిమాల‌ను తెర‌కెక్కిస్తుంటారు. ఫ‌లానా అబ్బాయి ఫ‌లానా అమ్మాయి టైటిల్ కు చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. నాగ‌శౌర్య‌, అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందిన‌ ఊహలు గుసగుసలాడే,  జ్యో అచ్యుతానంద సినిమాలు విజయాలు సాధించాయి.  ఈ సినిమాతో వీరిద్ద‌రు హ్యాట్రిక్ సాధిస్తార‌ని ఆశిద్దాం..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here