Home Actor నాటి చిత్ర‌ల‌హ‌రికి నేటి చిత్ర‌ల‌హ‌రికి తేడా ఏమిటో చెప్పిన సుకుమార్..!

నాటి చిత్ర‌ల‌హ‌రికి నేటి చిత్ర‌ల‌హ‌రికి తేడా ఏమిటో చెప్పిన సుకుమార్..!

84
0


మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం చిత్ర‌ల‌హ‌రి. ఇందులో సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న కల్యాణీ ప్రియదర్శన్‌, నివేథ పేతురాజ్‌లు నటిస్తున్నారు.  మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తోన్న చిత్ర‌ల‌హ‌రి టీజ‌ర్ ను ఈ రోజు రిలీజ్ చేసారు. చిత్ర‌ల‌హ‌రి..అప్ప‌ట్లో దూర‌ద‌ర్శ‌న్ లో ఎవ్రీ ఫ్రైడే వ‌చ్చే ఓ ప్రోగ్రామ్. ఈ చిత్ర‌ల‌హ‌రి 2019లో ఫ్రైడే రిలీజ్ అవ్వ‌బోయే సినిమా. అందులో కొన్ని పాట‌లు..ఇందులో కొన్ని పాత్ర‌లు అని సుకుమార్ వాయిస్ తో టీజ‌ర్ స్టార్ట్ అవుతుంది.

నివేథ పేతురాజ్, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్, సునీల్, సాయిధ‌ర‌మ్ తేజ్ పాత్ర‌ల చుట్టూ తిరిగే క‌థ‌ని టీజ‌ర్ ద్వారా చెప్పారు. ఈ టీజ‌ర్ చూస్తుంటే.. స‌రైన స‌క్సస్ కోసం ఎదురు చూస్తోన్న సాయిధ‌ర‌మ్ తేజ్ కి ఈ సినిమా ఖ‌చ్చితంగా విజయాన్ని అందిస్తుంద‌నిపిస్తోంది. టీజ‌ర్ రిలీజ్ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో సాయిధ‌ర‌మ్ తేజ్ మాట్లాడుతూ…వాయిస్ ఓవ‌ర్ కావాలి సార్ అని అడిగిన వెంట‌నే ఓకే చెప్పి..వాయిస్ అందించిన సుకుమార్ గార్కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను.

దేవి చాలా మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఈ సినిమాలో ఉన్న నాలుగు సాంగ్స్ చాలా బాగున్నాయి. మాకు ఏ లోటు లేకుండా చూసుకుని ఓ మంచి సినిమా అందిస్తున్న ఈ చిత్ర నిర్మాత‌ల‌కు థ్యాంక్స్. కిషోర్ ఎలాగైతే క‌థ చెప్పాడో..దాని క‌న్నా బాగా తీసాడు. నువ్వు నేను సినిమా చూసిన‌ప్పుడు సునీల్ కామెడీ టైమింగ్ ని చాలా బాగా ఎంజాయ్ చేసాను. ఆయ‌న‌తో క‌లిసి వ‌ర్క్ చేయాలి అనుకున్నాను. అది ఇప్పుడు అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా అంద‌రికీ న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నాను అన్నారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here