Home Actor నాడు రాజ‌కుమారుడు – నేడు మ‌హ‌ర్షి..!

నాడు రాజ‌కుమారుడు – నేడు మ‌హ‌ర్షి..!

109
0

సూపర్‌స్టార్ మహేష్ హీరోగా సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం మ‌హ‌ర్షి. వైజయంతి మూవీస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా బ్యాన‌ర్స్ పై  హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందుతోన్న‌ ‘మహర్షి’  మహేష్‌కు 25వ చిత్రం కావడం విశేషం. మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 9న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా, ‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను మే 1న ఎంతో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో అభిమానుల మధ్య సాయంత్రం 6 గంటల నుండి ఈ ఫంక్షన్ జరగనుంది.

ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇటీవల విడుదైలెన ‘ఛోటి ఛోటి ఛోటి బాతే.. మీటి మీటి మీటి యాదే’, ‘‘నువ్వే సమస్తం.. నువ్వే సిద్ధాంతం….నువ్వే నీపంతం, నువ్వేలే అనంతం’, ‘ఎవరెస్ట్ అంచున పూసిన రోజా పువ్వే ఓ చిరునవ్వే విసిరిందే..’ పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన వస్తోంది. కాగా ఈ చిత్రంలోని నాలుగో పాటను విడుదల చేశారు. ‘పదర పదర పదరా.. నీ అడుగుకి పదును పెట్టి పదరా.. ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా..’ అంటూ సాగే పాటను శ్రీమణి రచించగా దేవిశ్రీప్రసాద్ సంగీత సారధ్యంలో శంకర్ మహదేవన్ పాడారు. మహేష్ మొదటి సినిమా ‘రాజకుమారుడు’లో ‘బాలీవుడ్ బాలరాజు’ అనే పాటను శంకర్ మహదేవన్ పాడారు. 20 సంవత్సరాల తర్వాత ‘మహర్షి’ చిత్రంలో శంకర్ మహదేవన్ పాడడం విశేషం.

ఈ పాట పై గాయుకుడు శంకర్ మహదేవన్ స్పందిస్తూ…సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఫస్ట్ ఫిల్మ్ ‘రాజకుమారుడు’లో ‘బాలీవుడ్ బాలరాజు..’ అనే పాట పాడే అవకాశం వచ్చింది. ఒక హిస్టారికల్ మూమెంట్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్న సూపర్‌స్టార్ మహేష్‌బాబు 25వ సినిమా ‘మహర్షి’లో మళ్ళీ నాకు పాట పాడే అవకాశం వచ్చింది. నా ఫ్రెండ్ దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన ‘పదర పదర పదరా..’ అనే పాటను ఈ సినిమాలో పాడడం జరిగింది. శ్రీమణి ఈ పాటను రాశారు. ఎమోషనల్‌గా, ఇన్‌స్పిరేషనల్‌గా, స్ట్రాంగ్‌గా ఉండే పాట ఇది. ఈ పాట పాడే అవకాశం నాకు రావడం గౌరవంగా భావిస్తున్నాను. ఇది సినిమాలో చాలా ఇంపార్టెంట్ సాంగ్. ఈ సందరర్భంగా డైరెక్టర్ వంశీని కంగ్రాట్యులేట్ చేస్తూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here