Home Political News నాదెండ్ల మ‌నోహ‌ర్ చేరిక‌తో మ‌రింత వేడెక్కిన ఆంధ్ర రాజ‌కీయం..!

నాదెండ్ల మ‌నోహ‌ర్ చేరిక‌తో మ‌రింత వేడెక్కిన ఆంధ్ర రాజ‌కీయం..!

116
0
d35e291e-6f7c-4656-89e9-306834a6a9b8

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌లు రోజురోజుకు మ‌రెంత ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. ఈసారి  టీడీపీ – వైసీపీ మ‌ధ్య నువ్వా – నేనా అనేంత ఉత్కంఠ పోరు జ‌ర‌గ‌నుంది. అయితే..టీడీపీకి మ‌ద్ద‌తు ఇచ్చిన జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్… నారా చంద్ర‌బాబు నాయుడు పని తీరు న‌చ్చ‌క‌పోవ‌డం వ‌ల‌న‌ తీవ్ర స్ధాయిలో విమ‌ర్శించడంతో రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. ప‌వ‌న్ టీడీపీకి స‌పోర్ట్ ఇవ్వ‌క‌పోతే వైసీసీకి స‌పోర్ట్ చేస్తాడా..? అనే ప్ర‌శ్న వ‌చ్చింది కానీ..ప‌వ‌న్ మాత్రం ఎవ‌రికీ స‌పోర్ట్ చేయ‌కుండా అన్ని స్ధానాల్లో ఒంటిరిగా పోటీ చేయ‌డానికి సిద్ధం అయ్యారు.

దీంతో ఈసారి ఎన్నిక‌ల్లో ముక్కోణ‌పు పోటీ జ‌ర‌గ‌నుంది అనే విష‌యం తెలిసింది. అయితే… ఈ ముక్కోణ‌పు పోటీలో ఎవ‌రు విజేత‌గా నిలుస్తారు..?   ఎవ‌రు ఆంధ్ర సీఎం అవుతారు..?  అనేది ఆస‌క్తిగా మారింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆవేశ‌ప‌రుడు. అత‌ని స‌భ‌ల‌కు జ‌నాలు వ‌స్తారు కానీ..ఎన్నిక‌ల్లో ఆశించిన స్ధాయిలో ఆ పార్టీ అభ్య‌ర్ధులు గెల‌వ‌లేరు. అందుచేత ప‌వ‌న్ పార్టీ ప్ర‌భావం అంత‌గా ఉండ‌క‌పోవ‌చ్చు అనుకున్నారు. కానీ..రాజ‌కీయ విశ్లేష‌కుల‌కు కూడా అంత‌ప‌ట్ట‌ని ప్లాన్స్ తో ప‌వ‌న్ తెర వెనుక వ్యూహాలు ర‌చిస్తూ దూసుకెళుతున్నారు.

అందులో భాగంగానే నాదెండ్ల మ‌నోహ‌ర్ జ‌న‌సేన పార్టీలో చేరడం. మ‌నోహార్ జ‌న‌సేన‌లో చేరి అటు టీడీపీ ఇటు వైసీపీ నేత‌ల‌కు షాక్ ఇచ్చారు. అంతే కాకుండా…నాదెండ్ల చేరిక‌తో ఆంధ్ర రాజ‌కీయం మ‌రింత వేడెక్కింది అని చెప్ప‌చ్చు. ఈయ‌న స్పూర్తితో మ‌రి కొంత మంది నేత‌లు జ‌న‌సేన‌లో చేరేందుకు క్యూ క‌డుతున్నార‌ని తెలిసింది. మ‌నోహ‌ర్ రాక‌తో జ‌న‌సేన‌కు దూరంగా ఉన్న సామాజిక వ‌ర్గాన్ని ద‌గ్గ‌ర చేసుకునే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయని స‌మాచారం. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సామాజిక స‌మీక‌ర‌ణాల్లో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకునే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

నాదెండ్ల మ‌నోహ‌ర్ రాక‌తో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మ‌రి కొంత మంది నాయ‌కులు జ‌న‌సేన‌లో చేరేందుకు రెడీ అవుతున్నార‌ట‌. ప్ర‌స్తుతం జ‌న‌సేన పార్టీకి ల‌భిస్తోన్న ఆద‌ర‌ణ చూస్తుంటే…ప‌వ‌న్ కింగ్ మేక‌ర్ కానున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఇదే క‌నుక జ‌రిగితే… ఆంధ్రా రాజ‌కీయాల్లో కింగ్ మేక‌ర్ ప‌వ‌న్ అయితే…జ‌న‌సేన పార్టీలో కింగ్ మేక‌ర్ మ‌నోహ‌రే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here