Home Actor నాదెండ్ల మ‌నోహ‌ర్ తరుపున హైప‌ర్ ఆది ప్ర‌చారం – కార్య‌క‌ర్త‌ల‌లో ఉత్సాహం..!

నాదెండ్ల మ‌నోహ‌ర్ తరుపున హైప‌ర్ ఆది ప్ర‌చారం – కార్య‌క‌ర్త‌ల‌లో ఉత్సాహం..!

91
0


తెనాలి నియోజ‌క‌వ‌ర్గం నుంచి జ‌న‌సేన పార్టీ త‌రుపున నాదెండ్ల మ‌నోహ‌ర్ పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న ఇంటింటికి వెళ్ళి జ‌న‌సేన పార్టీ విధి, విధానాలు తెలియ‌చేస్తూ…గాజు గ్గాసు గుర్తు పై ఓటు వేసి జ‌న‌సేన పార్టీని గెలిపించాల‌ని కోరుతున్నారు. ప్ర‌జ‌ల నుంచి అనూహ్య‌మైన స్పంద‌న రావ‌డంతో రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళుతున్నారు.

ఇదిలా ఉంటే..నాదెండ్ల మ‌నోహ‌ర్ త‌రుపున తెనాలి నియోజ‌క‌వ‌ర్గంలోని అత్తోట‌లో జ‌బ‌ర్ధ‌స్త్ ఫేమ్ హైప‌ర్ ఆది ప్ర‌చారం చేస్తున్నారు. జనసేన కార్యకర్తలు, స్థానికులు పెద్ద ఎత్తున ఆయనతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. వీధివీధిలో తిరుగుతూ.. మనోహర్ గార్ని గెలిపించాలంటూ అభ్యర్థించాడు. ఆది ప్రచారానికి ప్ర‌జ‌ల నుంచి మంచి స్పందన లభించింది. తనదైన పంచ్ డైలాగులతో జనసేన కార్యకర్తలలో ఉత్సాహం నింపుతున్నాడు. ఈ సంద‌ర్భంగా హైప‌ర్ ఆది మాట్లాడుతూ.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సీఎం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని..జ‌న‌సేన గెలుపు కోసం త‌న వంతు ప్ర‌య‌త్నం చేస్తాన‌ని చెప్పారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here