Home Actor నానికి పోటీగా లారెన్స్..చివ‌రికి త‌గ్గేది ఎవ‌రు..?

నానికి పోటీగా లారెన్స్..చివ‌రికి త‌గ్గేది ఎవ‌రు..?

94
0


నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన తాజా చిత్రం జెర్సీ. మ‌ళ్లీ రావా ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన జెర్సీ చిత్రాన్ని ఏప్రిల్ 19న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ సంస్థ అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేసింది. అయితే…ఏప్రిల్ 19న రాఘ‌వ లారెన్స్ కాంచ‌న 3 చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్న‌ట్టు చిత్ర నిర్మాత ప్ర‌క‌టించారు. ఈ సినిమా తెలుగు, త‌మిళ్ లో రిలీజ్ కానుంది. దీంతో నాని సోలో రిలీజ్ ఛాన్స్ కి కాంచ‌న 3 బ్రేక్ వేసిందని చెప్ప‌చ్చు.

ఈ రెండు చిత్రాలు పోటీప‌డుతుండ‌డం ఆస‌క్తిగా మారింది. అయితే…కాంచ‌న 3 చిత్ర యూనిట్ మాత్రం నాని జెర్సీ మే 1కి వాయిదా వేసే అవ‌కాశాలు ఉన్నాయి. అందుచేత‌నే కాంచ‌న 3 చిత్రాన్ని ఏప్రిల్ 19న రిలీజ్ చేస్తున్నామ‌ని చెబుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఒక వేళ జెర్సీ రిలీజ్ వాయిదా ప‌డ‌క‌పోతే కాంచ‌న 3 రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. మ‌రి..లారెన్స్, నాని..చిత్రాలు ఎనౌన్స్ చేసిన డేట్ కే రిలీజ్ అవుతాయా..?  లేక చివ‌రి నిమిషంలో ఎవ‌రోఒక‌రు త‌మ చిత్రాన్ని వాయిదా వేస్తారా అనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here