Home Telugu నాని కొత్త సినిమా ఎనౌన్స్ మెంట్..!

నాని కొత్త సినిమా ఎనౌన్స్ మెంట్..!

149
0

నేచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం టాలీవుడ్ కింగ్ నాగార్జున‌తో క‌లిసి భారీ మ‌ల్టీస్టార‌ర్ లో న‌టిస్తున్నాడు. శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పై రూపొందుతోన్న ఈ సినిమాని వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే…కృష్ణార్జున యుద్ధం సినిమాతో వ‌రుస విజ‌యాల‌కు బ్రేక్ ప‌డ‌డంతో ఆలోచ‌న‌లో ప‌డిన నాని..చాలా క‌థ‌లు విని ఫైన‌ల్ గా ఓ క‌థ‌కి ఓకే చెప్పాడు.

సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాని నిర్మించ‌నుంది. ట్విట్ట‌ర్ ద్వారా ఈ విష‌యాన్ని తెలియ‌చేస్తూ… పోస్ట‌ర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ ను బట్టి ఇది క్రికెట్ నేపథ్యంలో సాగే కథ అని.. నాని ఈ సినిమాలో క్రికెటర్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఈ మూవీకి  ‘జెర్సీ’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. మ‌ళ్లీ రావా ఫేమ్ గౌత‌మ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. ఇది నానికి 23వ సినిమా.  చూస్తుండ‌గానే 25వ సినిమా ద‌గ్గ‌ర‌కి వ‌చ్చేసాడు. మ‌రి….కెరీర్ లో ముఖ్య‌మైన 25వ సినిమాని ఎవ‌రితో చేస్తాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here