Home Telugu నాని చేతుల మీదుగా గూఢ‌చారి ట్రైల‌ర్ రిలీజ్..!

నాని చేతుల మీదుగా గూఢ‌చారి ట్రైల‌ర్ రిలీజ్..!

130
0
Goodachari trailor release

అడివి శేష్ లేటెస్ట్ మూవీ గూఢ‌చారి. స్పై థ్రిల్లర్ గా రూపొందిన‌ ఈ మూవీ ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్ & ట్రైల‌ర్ చాలా ఇంట్ర‌స్టింగ్ గా, డిఫ‌రెంట్ గా ఉండ‌డంతో ఈ సినిమాకి  ఫ‌స్ట్ నుంచి పాజిటివ్ టాక్ ఉంది. నూత‌న ద‌ర్శ‌కుడు శ‌శికిర‌ణ్ తిక్క ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ స్పై థ్రిల్లర్ ను అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విస్టా డ్రీమ్ మర్చంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. నిర్మాత అనిల్ సుంక‌ర ఈ చిత్రాన్ని త‌మ సంస్థ ద్వారా రిలీజ్ చేస్తున్నారు.

ఈరోజు అన్న‌పూర్ణ స్టూడియోస్ లో  గూఢ‌చారి ట్రైల‌ర్ ని నేచురల్ స్టార్ నాని రిలీజ్ చేసారు. ఇక ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే..ఒక చిన్న‌పిల్లాడు నాన్న ద‌గ్గ‌ర‌కి వెళుతున్నామా..?  అని అడిగితే…నాన్న‌ని (ర‌ఘ‌వీర్) కాపాడలేక‌పోయాను రా…అని ప్ర‌కాష్ రాజ్ చెప్ప‌డంతో ట్రైల‌ర్ స్టార్ట్ అవుతుంది. తండ్రిని కోల్పోయిన ఆ పిల్లాడు పేరు అర్జున్. నాన్న‌లా దేశాన్ని కాపాడ‌డమే గోల్ గా పెట్టుకుంటాడు. అయితే…అర్జున్ చేస్తోన్న ప‌నులు వ‌ల్ల దేశం కోసం ప్రాణాలిచ్చిన‌ ర‌ఘ‌వీర్ కొడుకేనా ఇలా చేస్తుంది అనిపిస్తుంది. టీజ‌ర్ వ‌లే ట్రైల‌ర్ కూడా చాలా ఇంట్ర‌స్టింగ్ గా ఉంది.

హై టెక్నికల్‌ వ్యాల్యూస్ ఈ సినిమాని నిర్మించార‌ని ప్ర‌తి ఫేమ్ చెప్ప‌క‌నే చెబుతుంది. ఖ‌చ్చితంగా ఆడియ‌న్స్ కి క‌నెక్ట్ అవుతుంది అందులో ఎలాంటి సందేహం లేదు.  దాదాపు రెండు దశాబ్ధాల తర్వాత సుప్రియా యార్లగడ్డ మళ్ళీ వెండితెరకు ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వ‌డం విశేషం. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ ట్రైల‌ర్ కార్య‌క్ర‌మంలో అడివి శేష్, శోభిత దులిపాళ్ల, డైరెక్ట‌ర్ శ‌శికిర‌ణ్ తిక్క‌, నిర్మాత టి.జి.విశ్వ‌ప్ర‌సాద్, స‌హ‌నిర్మాత వివేక్ కూచిభ‌ట్ల‌, రైట‌ర్ అబ్బూరి ర‌వి, నిర్మాత అనిల్ సుంక‌ర త‌దిత‌రులు పాల్లొన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here