Home Movie News నాని జెర్సీ సినిమా ప్రారంభం..!

నాని జెర్సీ సినిమా ప్రారంభం..!

84
0

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా మ‌ళ్ళీ రావా ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో జెర్సీ అనే సినిమా రూపొంద‌నుంద‌నే విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్నిప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై నాగ‌వంశీ నిర్మిస్తున్నారు.  నాచురల్ స్టార్ నాని హీరో గా, శ్రద్దా శ్రీనాద్ (యు టర్న్ ఫేం ) హీరోయిన్ గా   “జెర్సీ “చిత్రం ఈ రోజు ఉదయం  ఫిల్మ్ నగర్ లోని  సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

నాని పై చిత్రీక‌రించిన ముహుర్త‌పు స‌న్నివేశానికి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ క్లాప్ ఇచ్చారు. రేపటి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభ మవుతుందని నిర్మాత సూర్య దేవర నాగ వంశీ తెలియ జేశారు. నాచురల్ స్టార్  “నాని” ,శ్రద్దా  శ్రీనాద్,సత్యరాజ్,బ్రహ్మాజీ,రోనిత్ కామ్రా త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్:అనిరుధ్, కెమెరామాన్ :సాను వర్గీస్, ఆర్ట్ డైరెక్టర్:అవినాష్ కొల్లా, ఎడిటర్ :నవీన్ నూలి, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్, ప్రొడ్యూసర్: సూర్య దేవర నాగ వంశీ,కధ,స్క్రీన్ ప్లే ,దర్సకత్వం :గౌతం తిన్ననూరి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here