Home Actor నాని న్యూమూవీ టైటిల్ ఇదే..!

నాని న్యూమూవీ టైటిల్ ఇదే..!

92
0


నాని న‌టిస్తోన్నతాజా చిత్రం జెర్సీ. మ‌ళ్లీ రావా ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఏప్రిల్ 19న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు. మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో నాని ఓ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత నాని ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమ చేయ‌నున్నారు. గతంలో నాని కథానాయకుడిగా దర్శకుడు ఇంద్ర‌గంటి మోహనకృష్ణ అష్టా చమ్మా, జెంటిల్ మేన్ చిత్రాల‌ను తెరకెక్కించారు. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాలు సాధించాయి.

ఇక సుధీర్ బాబు హీరోగా ఇంద్ర‌గంటి మోహనకృష్ణ తో  సమ్మోహనం అనే సినిమాని తెర‌కెక్కించారు. ఈ సినిమా కూడా స‌క్స‌స్ సాధించింది. ఇప్పుడు ఈ ఇద్దరి హీరోలతో ఒక మల్టీ స్టారర్ మూవీ చేయడానికి ఇంద్రగంటి మోహనకృష్ణ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మించ‌నున్నారు. ఈ మ‌ల్టీస్టార‌ర్ మూవీకి వ్యూహం అనే టైటిల్ ను ఖరారు చేసార‌ని తెలిసింది. స్ర్కిప్ట్ వ‌ర్క్ పూర్త‌య్యింది. త్వ‌ర‌లోనే పూర్తి వివ‌రాల‌తో అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేస్తార‌ని స‌మాచారం.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here