Home Actor నాలుగు భాష‌ల్లో డియర్ కామ్రేడ్ – టీజ‌ర్ రిలీజ్ కి ముహుర్తం ఫిక్స్..!

నాలుగు భాష‌ల్లో డియర్ కామ్రేడ్ – టీజ‌ర్ రిలీజ్ కి ముహుర్తం ఫిక్స్..!

85
0


ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం, పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి చిత్రాల‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసి..గీత గోవిందం చిత్రంతో సంచ‌ల‌న విజ‌యం సాధించి స్టార్ స్టేట‌స్ సొంతం చేసుకున్న సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. తాజాగా విజయ్ దేవ‌ర‌కొండ న‌టిస్తోన్న చిత్రం డియ‌ర్ కామ్రేడ్. ఈ చిత్రానికి భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న ర‌ష్మిక న‌టిస్తోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది.

వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాని తెలుగు, త‌మిళ్, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో భారీ స్ధాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ గురించి విజ‌య్ దేవ‌ర‌కొండ ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ…ఈ నెల 17న డియ‌ర్ కామ్రేడ్ టీజ‌ర్ రిలీజ్ చేయనున్న‌ట్టు తెలియ‌చేసారు. గీత గోవిందం సినిమాలో న‌టించిన విజ‌య్, ర‌ష్మిక మ‌రోసారి జంట‌గా న‌టిస్తోన్న ఈ సినిమా పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. మే 22న ఈ సినిమాని రిలీజ్ చేయ‌నున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here