Home Actor నా క‌థ‌ను నేనే తెర‌పై చూసుకోవ‌డం అదృష్టంగా భావిస్తున్నాను – ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత చింత...

నా క‌థ‌ను నేనే తెర‌పై చూసుకోవ‌డం అదృష్టంగా భావిస్తున్నాను – ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత చింత కింద మల్లేశం

122
0

ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత చింత‌కింది మ‌ల్లేశం జీవిత‌క‌థ‌ను ఆధారంగా చేసుకుని రూపొందుతున్న చిత్రం `మ‌ల్లేశం`. వెండితెర పై ఈయ‌న పాత్ర‌లో ప్రియ‌దర్శి క‌నిపించ‌నున్నాడు. రాజ్‌.ఆర్ ద‌ర్శ‌కుడు. రాజ్‌.ఆర్‌, శ్రీఅధికారి నిర్మాత‌లు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో జూన్ 21న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా ట్రైల‌ర్‌ను హైద‌రాబాద్‌లో విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత చింత‌కింది మ‌ల్లేశం, పల్లె సృజ‌న నిర్వాహ‌కులు గ‌ణేశం, త‌రుణ్ భాస్క‌ర్‌, సందీప్‌కిష‌న్‌, ప్రియ‌ద‌ర్శి, రాజ్‌.ఆర్‌, శ్రీఅధికారి త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా గ‌ణేశం మాట్లాడుతూ… “నేను సినిమాలు చూస్తాను కానీ.. ఇండ‌స్ట్రీ గురించి పెద్ద‌గా తెలియ‌దు. రెండేళ్ల క్రితం రాజ్ గారు న‌న్ను క‌ల‌సి ఇలా మ‌ల్లేశం గారి సినిమా తీద్దామ‌నుకుంటున్నాను అని చెప్పారు. నిజ‌మైన క‌థ‌ను త‌క్కువ స‌మ‌యంలో చెప్ప‌డ‌మ‌నేది చాలా గొప్ప విష‌యం“ అన్నారు.

చింత‌కింది మ‌ల్లేశం మాట్లాడుతూ… “ఒక రోజు రాజ్ గారు ఫోన్ చేసి యూట్యూబ్‌లో మీరు మాట్లాడింది చూశాను. దాని గురించి సినిమా తీయాల‌ని అనుకుంటున్నాను అన్నారు. రెండున్న‌రేళ్లు క‌ష్ట‌ప‌డి క‌థ‌ను సిద్ధం చేసుకున్నారు. ఫైన‌ల్‌గా ఈరోజు సినిమా చూస్తున్నాను. సామాన్య మాన‌వుడి జీవితాన్ని సినిమాగా తీయ‌డం చాలా గొప్ప విష‌యం. ప్ర‌పంచానికి మ‌ల్లేశం గురించి చెప్పాల‌నే రాజ్ గారి సంక‌ల్పం నేర‌వేరింది. సినిమా చూశాను ప్రియ‌ద‌ర్శి గారు అద్భుతంగా న‌టించారు. ఝాన్సీ గారు మా అమ్మ‌గారి పాత్ర‌లో న‌టించారు. సినిమాలో ఆమెను చూస్తే మా అమ్మ‌గారిని చూసిన ఫీలింగే క‌లిగింది. అలాగే చ‌క్ర‌పాణి గారు మా నాన్న‌పాత్ర‌లో అద్భుతంగా న‌టించారు. సినిమా చూసే సంద‌ర్భంలో ఓసారి క‌ళ్ల‌లో నీళ్లు కూడా తిరిగాయి. నా క‌థ‌ను నేను తెర పై చూసుకోవ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను“ అన్నారు.

వెంక‌ట సిద్ధారెడ్డి మాట్లాడుతూ… “80 బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తీయ‌డం అంటే ఎంత క‌ష్ట‌మో నాకు తెలుసు. యూనిట్ అంద‌రూ చాలా క‌ష్ట‌ప‌డి చేసిన సినిమా ఇది. జూన్ 21న విడుద‌లవుతున్న ఈ సినిమా మంచి విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

గొరేటి ఎంక‌న్న మాట్లాడుతూ… “ఈ సినిమాలో రెండు అద్భుత‌మైన పాట‌లు రాసే అవ‌కాశం క‌లిగింది. ఆద‌ర్శవంత‌మైన వ్య‌క్తి బ‌యోపిక్ ఇది. ట్రెండ్ సెట్ట‌ర్ మూవీ అవుతుంది“ అన్నారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ మార్క్ కె.రాబిన్స్ మాట్లాడుతూ… “రాజ్‌గారితో సినిమా చేసే క్ర‌మంలో చాలా దూరం ట్రావెల్ చేశాం. ద‌ర్శిలో మ‌ల్లేశం గారు క‌న‌ప‌డ్డారు. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌. ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు“ అన్నారు.

మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి మాట్లాడుతూ… “అ సినిమా చూసిన తొలి ప్రేక్ష‌కుడిని నేనే. దీన్ని తెలుగు సినిమా అన‌డం కంటే ఇండియ‌న్ మూవీ అంటే క‌రెక్ట్‌. బ‌యోపిక్ కా బాప్‌. ఆర్ట్ మూవీ కాదు. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మూవీ“ అన్నారు.

సందీప్‌కిష‌న్ మాట్లాడుతూ… “మ‌ల్లేశంగారి లాంటి గొప్ప వ్య‌క్తి బ‌యోపిక్‌ను ప్రియ‌ద‌ర్శి త‌న రెండు భుజాల‌పై మోశాడు. త‌న స్నేహితుడిగా నేను ఇక్క‌డికి రావ‌డం ఆనందంగా ఉంది. రాజ్‌గారికి పెద్ద ఫ్యాన్‌ని అయ్యాను. ఆయ‌న ఇన్‌టెన్స్‌, నిజాయ‌తీతో కూడిన ఆయ‌న ఆలోచ‌న‌కు నేను ఫ్యాన్‌గా మారాను. ఈ సినిమాకు నా కాంట్రీబ్యూష‌న్ ఏదీ లేదే అని బాధ‌గా కూడా ఉంది. మ‌నం తెలుగు ఇండ‌స్ట్రీలో ఉన్నామ‌ని గ‌ర్వంగా చెప్పుకోవ‌చ్చు. మ‌న ప్రేక్ష‌కులు పెళ్లిచూపులు చూస్తారు..ఒక అర్జున్ రెడ్డి చూస్తారు.. ఒక గూఢ‌చారి చూస్తారు.. ఒక బాహుబ‌లి చూస్తారు. అదే స‌మ‌యంలో వేరే భాష నుండి డ‌బ్ చేసుకుని వ‌స్తే కె.జి.య‌ఫ్ బ్లాక్ బ‌స్ట‌ర్ చేస్తారు. కంటెంట్ బావుంటే చూడ‌టానికి మ‌న జ‌నాలంతా గొప్ప జ‌నాలు లేరు.  నాకు ఈ సినిమా పరంగా ఏదైనా చేయాల‌ని అనుకుంటున్నాను. అందుక‌ని తొలి వంద టికెట్ల‌ను నేనే కొంటాను“ అన్నారు.

ద‌ర్శ‌క నిర్మాత రాజ్‌.ఆర్ మాట్లాడుతూ… “సినిమా చేయ‌డానికి ప‌ర్మిష‌న్ ఇచ్చిన ప‌ల్లెసృజ‌న నిర్వాహ‌కులు గ‌ణేశంగారికి, మ‌ల్లేశం గారికి థాంక్స్‌. బ‌యోపిక్ అంటే ఓ బాధ్య‌త దాన్ని ఎంతో స‌మ‌ర్ధ‌వంతంగా నిర్వ‌ర్తించాం. టీం అందరం నిజాయ‌తీతో సినిమాను పూర్తి చేశాం. ఇది ఆర్ట్ ఫిలిం కాదు. కమ‌ర్షియ‌ల్ మూవీ. ముందు ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, నానిల‌ను హీరోలుగా అనుకున్నాను.  కానీ డేట్స స‌మ‌స్య రావ‌డంతో ప్రియ‌ద‌ర్శిని తీసుకున్నాం.

అలాగే త‌రుణ్ భాస్క‌ర్‌ను సినిమాను డైరెక్ట్ చేయ‌మ‌ని అడిగాను కానీ కుద‌ర‌లేదు. ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్థులు ప‌రీక్ష‌ల్లో ఫెయిల్ అయ్యామ‌ని ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారు కానీ… ఆరో త‌ర‌గ‌తి డ్రాప్ అవుట్ అయి .. ప‌ద్మ‌శ్రీ అవార్డు అందుకోవ‌డం వ‌ర‌కు ఎదిగిన మ‌ల్లేశం గారిని స్ఫూరిగా తీసుకోవాలి. నా ప్ర‌యాణంలో స‌హ‌కారం అందించిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ వెంక‌ట్ సిద్ధారెడ్డిగారికి, ఆర్ట్ డైరెక్ట‌ర్ లక్ష్మణ్ ఏలే, మ‌హేష్ స‌హా ఎంటైర్ యూనిట్‌కు థాంక్స్‌“ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here