Home Actor నా ప్రతి పాటను నేను అవార్డుగానే భావిస్తాను – సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి

నా ప్రతి పాటను నేను అవార్డుగానే భావిస్తాను – సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి

126
0
Padma Shri Sirivennela Sitarama Sastry Press Meet Stills

విధాత తలపున ప్రభవించినది…అంటూ ఆయన రాసిన మొదటి పాటే తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ఆయనకు ప్ర‌త్యేక స్థానం సంపాదించి పెట్టంది. ఆయ‌న మొద‌టి సినిమా సిరివెన్నెల ఆయ‌న ఇంటి పేరు అయ్యింది. ఆయ‌నే సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి. ఆయ‌న‌కు ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద్మ‌శ్రీ అవార్డు ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా  త‌న స్పంద‌న‌ను మీడియాతో పంచుకున్నారు. హైద‌రాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి మాట్లాడుతూ…నా పేరు సూచించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. సీతారామశాస్త్రికి ఈ అవార్డు ఇవ్వాలి అని చెప్పి, ఎందుకు ఇవ్వాలో కేంద్రానికి సకాలంలో వివరిస్తూ తమ అభ్యర్థనలను పంపిన వేలాది మందికి పేరు పేరునా ధన్యవాదాలు.

నాకు అవార్డు రావడం వేడుకగా, పండగలా భావిస్తున్న ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ అవార్డు నాకు రావాలని కోరుకున్న తెలుగు ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా లక్షల్లో ఉన్నారు. 30 ఏళ్లుగా నేను సాగిస్తున్న ఈ సాహితీ వ్యవసాయానికి ఫల సాయంగా నాకు పద్మ అవార్డు రావాలనేది వారి ఆకాంక్ష, ఆశీర్వాదం, కోరిక. ఇవన్నీ కలిపి ఈ రూపంలో వచ్చాయి అనుకుంటున్నాను. వారి ఆనందానికి కారణమైన నా సాహితీ వ్యవసాయం పట్ల నాకు ఒకింత వినయంతో కూడిన గర్వం కలిగింది.

నాకు గీత రచయితగా జన్మనిచ్చిన దర్శకులు విశ్వనాథ్‌గారి చరణాలకు నమస్కరిస్తున్నా. నేను ఇక్కడికి వచ్చి పాటలు రాయాలని తలపించిన మా మాస్టారును తలచుకుంటున్నా. ఈ వేడుకను పై నుంచి చూస్తున్న నాన్నగారికి నమస్కరిస్తున్నాను.  పద్మ అవార్డుని ఆశించలేదు. నా ప్రతి పాటను నేను అవార్డుగానే భావిస్తాను. ఎంతో మంది అభిమానించారు. వారి హృదయ స్పందన కన్నా పెద్ద అవార్డు ఉంటుందని అనుకోను. అవార్డు కోసం నేను ఎప్పుడూ అప్లై చేసుకోలేదు. నా ప్రతి పాట నాకు నచ్చుతుంది. ‘లాలిజో..లాలిజో ఊరుకో పాపాయి, గుమ్మాడి గుమ్మాడి.. ఇలా అనేక పాటలు ఉన్నాయి అని తెలియ‌చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here