Home Telugu నా సినిమా మిస్ అయ్యింది. బాధ‌గా ఉందన్న హ‌రీష్ శంక‌ర్..!

నా సినిమా మిస్ అయ్యింది. బాధ‌గా ఉందన్న హ‌రీష్ శంక‌ర్..!

134
0
Harish Shankar reaction about his movie

నిర్మాత దిల్ రాజు – ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్..క‌లిసి రామ‌య్యా వ‌స్తావ‌య్యా, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్, దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ చిత్రాలు రూపొందించారు. వీరిద్ద‌రి మ‌ధ్య మంచి అనుబంధం ఉంది. హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కించ‌నున్న మ‌ల్టీస్టార‌ర్ మూవీని కూడా దిల్ రాజు నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. క‌థ ఇంకా పూర్తి కాక‌పోవ‌డం వ‌ల‌నే సెట్స్ పైకి వెళ్ల‌లేదు కానీ..లేక‌పోతే ఈపాటికే ఈ మ‌ల్టీస్టార‌ర్ షూటింగ్ జ‌రుపుకుంటూ ఉండాలి.

ఇదిలా ఉంటే…దిల్ రాజు ప్ర‌స్తుతం 5 సినిమాలు నిర్మిస్తున్నాడు. రాజ్ త‌రుణ్ తో నిర్మించిన ల‌వ‌ర్ చిత్రాన్ని ఈనెల 20న‌, నితిన్ శ్రీనివాస క‌ళ్యాణం చిత్రాన్ని ఆగ‌ష్టు 9న‌, రామ్ హ‌లో గురు ప్రేమ కోస‌మే చిత్రాన్ని అక్టోబ‌ర్ 18న‌, వెంక‌టేష్ – వ‌రుణ్ తేజ్ ల ఎఫ్ 2 చిత్రాన్ని జ‌న‌వ‌రి 12న‌, మ‌హేష్ బాబు 25వ చిత్రాన్ని ఏప్రిల్ 5న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ఎనౌన్స్ చేసారు. ట్విట్ట‌ర్ లో వ‌చ్చిన ఈ వార్త గురించి డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ స్పందిస్తూ…ఈ లిస్ట్ నుంచి నా సినిమా మిస్ అయ్యింది. బాధ‌గా ఉంది. కానీ..కొన్ని సార్లు కొన్ని త‌ప్ప‌వు. ఈ 5 సినిమాలు స‌క్స‌స్ సాధించాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here