Home Actor నిఖిల్ అర్జున్ సుర‌వ‌రం విడుద‌ల వాయిదా..?

నిఖిల్ అర్జున్ సుర‌వ‌రం విడుద‌ల వాయిదా..?

98
0


యంగ్ హీరో నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం అర్జున్ సురవరం. టి. సంతోష్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో నిఖిల్ జ‌ర్న‌లిస్ట్ గా న‌టిస్తున్నారు. ఈ మూవీ టీజర్‌ను మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా రిలీజ్ చేసారు. ఈ టీజ‌ర్ కు అనూహ్య‌మైన స్పంద‌న వ‌చ్చింది. మెగాస్టార్ చిరంజీవి కూడా అర్జున్ సుర‌వ‌రం టీజ‌ర్ చాలా ఇంట్ర‌స్టింగ్ గా ఉంది అంటూ టీమ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. దీంతో చిరు మ‌న‌సు దోచుకున్న ఈ సినిమా పై మ‌రింత ఆస‌క్తి ఏర్ప‌డింది. 

ఈ మూవీ నైజాం రైట్స్ ను ఏసియన్ సినిమాస్ సునీల్ నారంగ్ 4 కోట్ల‌కు ద‌క్కించుకున్నారు. నిఖిల్ కెరీర్ లో నైజాం ఏరియా హ‌క్కుల‌ను 4 కోట్ల‌కు ద‌క్కించుకోవ‌డం అనేది ఇదే హ‌య్య‌స్ట్. ఈ మూవీని ఈ నెల 29న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు కానీ..తాజా స‌మాచారం ప్ర‌కారం..మే 1న విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. స్యామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ‌ముర‌ళి, నాగినీడు, ప్ర‌గ‌తి, స‌త్య‌, త‌రుణ్ అరోరా, రాజా ర‌వీంద్ర ఈ చిత్రంలో స‌హాయ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ఔరా సినిమాస్ పివిటి, మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్పి బ్యాన‌ర్స్ పై కావ్య వేణుగోపాల్, రాజు కుమార్ నిర్మిస్తున్నారు. బి మ‌ధు ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తున్నారు. మ‌రి..అర్జున్ సుర‌వ‌రం రిలీజ్ వాయిదా అంటూ వ‌స్తున్న వార్త‌ల పై చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here