Home Actor నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ...

నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ‘కార్తికేయ – 2 ‘

73
0

2014 లో యువకథానాయకుడు నిఖిల్, స్వాతి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన ‘కార్తికేయ’ చిత్రం విడుదలై ఎంతటి ఘన విజయం సాధించిందో విదితమే. అప్పటి నుంచే ఆ చిత్రానికి సీక్వెల్ గా ‘కార్తికేయ – 2 ‘ చిత్రం రూపొందనుందన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికది నిజమవుతోంది.

నిఖిల్  హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ – 2 ‘ పేరుతో రూపొందనున్న ఈ చిత్రంను ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని కథానాయకుడు నిఖిల్ పుట్టిన రోజు జూన్ 1 సందర్భంగా అధికారికంగా వెల్లడి చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ…’నిఖిల్ హీరోగా దర్శకునిగా నా తొలి చిత్రం ‘కార్తికేయస‌ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మా కాంబినేషన్ లో రూపొందనున్న ‘కార్తికేయ – 2 ‘ చిత్రం పై అంచనాలు అధికంగానే ఉంటాయన్నది వాస్తవం. దీనికి తగినట్టుగానే ఈ చిత్రం ఉంటుంది. ‘కార్తికేయ’ కు కొనసాగింపుగా ‘కార్తికేయ – 2 ‘ ఉంటూనే కధా,కధనాల విషయంలో సరికొత్తగా ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే పర్ఫెక్ట్ సీక్వెల్ ఈచిత్రం అన్నారు.

‘కార్తికేయ – 2 ‘ చిత్రం ఈ ఏడాది ద్వితీయార్ధంలో నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించుకుంటుంది. చిత్రంలోని ఇతర నటీ,నట సాంకేతికవర్గం వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర నిర్మాత,దర్శకులు తెలిపారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి నిర్మాత  టి.జి.విశ్వప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొద్యూసర్  వివేక్ కూచిభొట్ల. కథ-మాటలు-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: చందు మొండేటి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here