Home Actor నితిన్ ఆ డైరెక్ట‌ర్ కి ఓకే చెప్పాడా..?

నితిన్ ఆ డైరెక్ట‌ర్ కి ఓకే చెప్పాడా..?

60
0


యువ హీరో నితిన్ ఇటీవ‌ల చేసిన చిత్రాలు లై, ఛ‌ల్ మోహ‌న్ రంగ‌, శ్రీనివాస క‌ళ్యాణం చిత్రాలు ఫ్లాప్ అవ్వ‌డంతో..క‌థ‌ల విష‌యంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఛ‌లో ఫేమ్ వెంకీ కుడుముల‌తో భీష్మ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోన్న ఈ సినిమా త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీ త‌ర్వాత గుండెజారీ గ‌ల్లంత‌య్యిందే ద‌ర్శ‌కుడు కొండా విజ‌య్ కుమార్ తో సినిమా చేయ‌నున్నార‌ని స‌మాచారం.

గుండెజారీ గ‌ల్లంత‌య్యిందే సినిమా త‌ర్వాత కొండా విజ‌య్ కుమార్ నాగ చైత‌న్య‌తో ఒక లైలా కోసం సినిమా తెర‌కెక్కించారు. ఈ సినిమా ఆశించిన విజ‌యాన్ని సాధించ‌లేదు. అయితే… ఇటీవ‌ల విజయ్ కుమార్ కొండా నితిన్ ని కలిసి ఒక కథ వినిపించగా, ఆయన ఓకే చెప్పార‌ని తెలిసింది.  కథా,కథనాల్లోని కొత్తదనమే అందుకు కారణమని చెబుతున్నారు. ప్రస్తుతం దర్శకుడు వెంకీ కుడుములతో చేయ‌నున్న‌ భీష్మ త‌ర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here