Home Movie News నితిన్ నెక్ట్స్ మూవీ ప్రారంభం ఎప్పుడు..?

నితిన్ నెక్ట్స్ మూవీ ప్రారంభం ఎప్పుడు..?

92
0

యువ హీరో నితిన్ న‌టించిన లై, ఛ‌ల్ మోహ‌న రంగ‌, శ్రీనివాస క‌ళ్యాణం..చిత్రాలు వ‌రుస‌గా ఫ్లాప్ అవ్వ‌డంతో కెరీర్ లో బాగా వెన‌క‌బ‌డ్డాడు. ఈసారి ఎలాగైనా స‌రే విజ‌యం సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో భీష్మ సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నాడు.దీనికి సింగిల్ ఫ‌రేవ‌ర్ అనేది ట్యాగ్ లైన్.  ఈ చిత్రానికి  ఛ‌లో ఫేమ్ వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందే ఈ సినిమాని సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై నాగ‌వంశీ నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో నితిన్ స‌ర‌స‌న హ‌న్సిక న‌టించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. లేటెస్ట్ న్యూస్ ప్ర‌కారం…ఈ సినిమాని ఈ నెలాఖ‌రున ప్రారంభించ‌నున్నార‌ని స‌మాచారం. ఛ‌లో సినిమా వ‌లే ఈ సినిమాలో ల‌వ్ తో పాటు  ఎంట‌ర్ టైన్మెంట్ ఫుల్ గా ఉంటుంద‌ని తెలిసింది. వ‌రుస‌గా ఫ్లాప్స్ రావ‌డంతో నితిన్ ఈ సినిమా పై చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. మ‌రి..ఈ సినిమా అయినా నితిన్ కి విజ‌యాన్ని అందిస్తుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here