Home Telugu నితిన్ సినిమా రిలీజ్ కావ‌డం లేదా..?  కార‌ణం..?

నితిన్ సినిమా రిలీజ్ కావ‌డం లేదా..?  కార‌ణం..?

102
0

యువ హీరో నితిన్ న‌టిస్తోన్న తాజా చిత్రం శ్రీనివాస క‌ళ్యాణం. ఈ చిత్రానికి వేగేశ్న స‌తీష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.  క్లాస్ .. మాస్ .. యూత్ ఆడియ‌న్స్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమా కోసం గోదావరి జిల్లాల్లో, చండీఘర్ లో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు.

ఈ సినిమాలో  నితిన్ స‌ర‌స‌న రాశి ఖన్నా, నందిత శ్వేత నటిస్తున్నారు. ఇటీవ‌ల ఛ‌ల్ మోహ‌న్ రంగ సినిమాతో ఆక‌ట్టుకోలేక‌పోయిన నితిన్ ఈ సినిమా పై చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. ఇక ఈ మూవీని జులై 24న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు గ‌తంలో నిర్మాత దిల్ రాజు ఎనౌన్స్ చేసారు. అయితే…దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతోన్న ల‌వ‌ర్ చిత్రం జులైలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. అందుచేత నితిన్ శ్రీనివాస క‌ళ్యాణం చిత్రాన్ని ఆగ‌ష్టులో రిలీజ్ చేయాల‌నుకుంటున్నార‌ని స‌మాచారం. మ‌రి…ఛ‌ల్ మోహ‌న్ రంగ సినిమాతో బాగా డీలా ప‌డ్డ నితిన్ కి శ్రీనివాస క‌ళ్యాణం ఆశించిన విజ‌యం అందిస్తుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here