Home Actor నిను వీడ‌ని నీడను నేనే రివ్యూ.

నిను వీడ‌ని నీడను నేనే రివ్యూ.

219
0
నిను వీడ‌ని నీడను నేనే రివ్యూ spiceandhra

సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించి, నిర్మించిన‌ చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. అన్యా సింగ్ కథానాయిక. కార్తీక్ రాజు దర్శకుడు. స‌రైన స‌క్స‌స్ లేక కెరీర్ లో బాగా వెన‌క‌బ‌డిన సందీప్ కిష‌న్ ఈసారి ఎలాగైనా స‌రే విజ‌యం సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఈ చిత్రం చేసాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందీప్ కిష‌న్ స్పందిస్తూ… నేను ఎప్పుడూ నా సినిమా ఫంక్ష‌న్స్‌లో మంచి సినిమా తీశాన‌ని చెబుతా. ఫ‌స్ట్‌టైమ్ చెబుతున్నా… అదిరిపోయే సినిమా తీశా. ప‌క్కా హిట్ అయ్యే సినిమా తీశా అని చెప్పాడు. ఈ రోజు నిను వీడ‌ని నీడ‌ను నేనే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి… సందీప్ కిష‌న్ నమ్మ‌కం నిజ‌మైందా..?  ఆశించిన విజ‌యాన్ని అందించిందా..?  లేదా..?  అనేది చెప్పాలంటే ముందుగా క‌థ చెప్సాల్సిందే.

క‌థ – అది 2035వ సంవ‌త్స‌రం. ముర‌ళీశ‌ర్మ (సైకాల‌జీ ప్రొఫెస‌ర్) త‌న ఇంటికి వ‌చ్చిన స్టూడెంట్స్ కి 2013లో త‌న ద‌గ్గ‌ర‌కి వ‌చ్చిన ఓ కేసు గురించి చెప్ప‌డంతో సినిమా స్టార్ట్ అవుతుంది. అర్జున్ (సందీప్ కిష‌న్), మాధ‌వి (అన‌న్య సింగ్ ) ఒక‌రినొక‌రు ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకోవాల‌నుకుంటారు కానీ..పెద్ద‌లు అంగీక‌రించ‌రు. దీంతో పెద్ద‌ల‌ను ఎద‌రించి ఇద్ద‌రు రిజిష్ట‌ర్ మ్యారేజ్ చేసుకుంటారు. ఎంతో ప్రేమ‌గా ఉంటున్న వీళ్లు ఓ రోజు కారులో వెళుతుండ‌గా యాక్సిడెంట్ అవుతుంది.

ఆత‌ర్వాత అక్క‌డ నుంచి ఇంటికి వెళ్లిన వీళ్ల‌కి అద్దంలో వీళ్ల ఫేస్ కాకుండా వేరే వ్య‌క్తి ఫేస్ క‌నిపిస్తుంటుంది. ఇద్ద‌రికీ ఇలాగే జ‌రుగుతుంది. అలా క‌నిపించే వాళ్ల పేర్లు రిషి, దియా. ఎందుకు ఇలా జ‌రుగుతుందో తెలుసుకునేందుకు డాక్ట‌ర్ ను క‌లుస్తారు. పోలీసుల‌ను క‌లుస్తారు కానీ.. ఎందుకు ఇలా జ‌రుగుతుందో అర్ధం కాదు. అస‌లు రిషి, దియా ఎవ‌రు..?  వీళ్ల‌కే ఎందుకు క‌నిపిస్తున్నారు..?  ఈ మిస్ట‌రీని ఎలా ఛేదించారు అనేదే క‌థ‌.

విశ్లేష‌ణ – సందీప్ కామెడీ, ఎమోష‌న్, హ‌ర్ర‌ర్, యాక్ష‌న్.. ఇలా త‌న పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా చాలా బాగా న‌టించాడు. ఇక క‌థానాయిక అన‌న్య కూడా ఫ‌స్ట్ మూవీయే అయిన‌ప్ప‌టికీ చ‌క్క‌గా న‌టించింది. వెన్నెల కిషోర్, ముర‌ళీశ‌ర్మ‌, ప్ర‌గ‌తి పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా న‌టించారు. సినిమాలో ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించింది అంటే పోసాని కృష్ణ ముర‌ళీ. పోలీస్ పాత్ర‌లో పోసాని ఆక‌ట్టుకున్నాడు.

అర్జున్ అద్ధంలో చూసుకుంటే.. రిషి (వెన్నెల కిషోర్) క‌నిపిస్తుంటాడు. ఆడియ‌న్స్ లో ఇంట్ర‌స్ట్ క‌లిగించాడు. ఫ‌స్టాఫ్ అంతా ఇంట్ర‌స్టింగ్ గానే ఉంటుంది. ఇంట‌ర్వెల్ ట్విస్ట్ చాలా బాగుంది. అయితే.. సెకండాఫ్ స్టార్ట్ అయిన త‌ర్వాత కాస్త స్లో అయిన‌ట్టు అనిపిస్తుంది. రిషి క్యారెక్ట‌ర్ ను వేరే హీరో చేసుంటే ఇంకా బాగుండేది. అలా కాకుండా వెన్నెల కిషోర్ తో ఆ పాత్ర చేయించ‌డంతో ఆడియ‌న్స్ లో క‌థ పై ఆస‌క్తి త‌గ్గిన ఫీలింగ్ క‌లుగుతుంది.

సెకండాఫ్ లో ట్విస్టులు బాగున్నాయి. ద‌ర్శ‌కుడు కార్తిక్ రాజు రొటీన్ గా కాకుండా కొత్త క‌థ‌ను ఎంచుకున్నారు కానీ.. ఆడియ‌న్స్ ని ఆక‌ట్టుకునేలా తెర పైకి తీసుకురాలేక‌పోయార‌ని చెప్ప‌చ్చు. ప్ర‌మోద్ వ‌ర్మ సినిమాటోగ్ర‌ఫీ, త‌మ‌న్ సంగీతం ప్ల‌స్ పాయింట్స్. సందీప్ కి నిర్మాత‌గా తొలి చిత్రం అయిన‌ప్ప‌టికీ ఏమాత్రం రాజీప‌డ‌కుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాని నిర్మించారు.

థ్రిల్ల‌ర్ జోన‌ర్ లో వ‌స్తున్న సినిమాల‌కు పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉంది. లాజిక్కులు ప‌క్క‌న పెడితే… ఆడియ‌న్స్ కి  థ్రిల్ల‌ర్ జోన‌ర్ లో ఫీల్ గుడ్ మూవీ చూసిన ఫీలింగ్ క‌లిగిస్తుంది. ఇందులో ఎంట‌ర్ టైన్ చేయ‌డంతో పాటు మంచి మెసేజ్ కూడా ఉంది. సినిమా చూస్తున్న ప్రేక్ష‌కులు అక్క‌డ‌క్క‌డ క‌న్ ఫ్యూజ్ అవుతారు. అలా.. క‌న్ ఫ్యూజ్ లేకుండా ఉండేలా స్క్రిప్ట్ పై మ‌రింత‌గా వ‌ర్క్ చేసుంటే ఇంకా బాగుండేది. థ్రిల‌ర్ & సెస్పెన్స్ సినిమాలు ఇష్ట‌ప‌డే వారికి ఖ‌చ్చితంగా న‌చ్చుతుంది.

రేటింగ్ – 2.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here