Home Political News నిమ్స్ నివేదిక చూస్తే కేసీఆర్ బాగోతం బ‌య‌ట‌ప‌డుతుంది – ఉత్త‌మ్ కుమార్ రెడ్డి..!

నిమ్స్ నివేదిక చూస్తే కేసీఆర్ బాగోతం బ‌య‌ట‌ప‌డుతుంది – ఉత్త‌మ్ కుమార్ రెడ్డి..!

104
0

తెలంగాణ‌లో రానున్న ఎన్నిక‌ల నేప‌ధ్యంలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం రోజురోజుకు వేడెక్కుతోంది. ఇటీవ‌ల నిజామాబాద్ లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌ల‌లో కేసీఆర్ తెలుగుదేశం, కాంగ్రెస్ నాయ‌కుల పై మండిప‌డ్డారు. చంద్ర‌బాబును దొంగ అని.. కాంగ్రెస్ నాయ‌కులు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవ‌డం ఏంటి అంటూ తీవ్ర స్ధాయిలో విమ‌ర్శించారు. కేసీఆర్ వ్యాఖ్య‌ల పై మ‌హాకూట‌మి నాయ‌కులు ఫైర్ అయ్యారు. టీపీసీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల పై స్పందిస్తూ…నిరాహార దీక్ష‌లో కేసీఆర్ కేవ‌లం గ‌డ్డం మాత్ర‌మే పెంచుకున్నారని చెప్పారు.

నిమ్స్ హాస్ప‌ట‌ల్  ఇచ్చిన నివేదిక చూస్తే…కేసీఆర్ బాగోతం బ‌య‌ట‌ప‌డుతుందని… అవ‌స‌ర‌మైన ఫ్లూయిడ్స్ తీసుకుని దొంగ దీక్ష చేసార‌న్నారు. నిజామాబాద్ స‌భ‌లో త‌న‌ గురించి అడ్డుగోలుగా మాట్లాడాడారు…నేను దేశం కోసం స‌రిహ‌ద్దుల్లో పైల‌ట్ గా ప‌ని చేసా. కేసీఆర్ దుబాయికి దొంగ పాస్ పార్ట్ ల ఏజెంట్ గా వ‌ర్క్ చేసార‌న్నారు టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి.  మ‌హా కూట‌మిని చూసి కేసీఆర్ ఎందుకు భ‌య‌ప‌డుతున్నార‌ని ప్ర‌శ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here