Home Political News నియంత‌లా వ్య‌వ‌హ‌రిస్తూ కేసీఆర్ ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు – కాంగ్రెస్ నేత జానారెడ్డి

నియంత‌లా వ్య‌వ‌హ‌రిస్తూ కేసీఆర్ ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు – కాంగ్రెస్ నేత జానారెడ్డి

106
0

తెలంగాణలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం రోజురోజుకు మారుతుంది. కేసీఆర్ అసెంబ్లీని ర‌ద్దు చేసేట‌ప్ప‌టికి ఉన్న ప‌రిస్థితి వేరు..ఇప్పుడు వేరు. చాలా ఈజీగా కేసీఆర్ మ‌ళ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి ముఖ్య‌మంత్రి అవుతాను అనుకున్నారు కానీ…కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ ల‌తో మ‌హాకూట‌మి ఏర్ప‌డ‌డంతో టీఆర్ఎస్ కు గ‌ట్టి పోటీ ఎదుర‌వుతోంది. కాంగ్రెస్ పార్టీ ప్ర‌చారంలో స్పీడు పెంచింది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జానా రెడ్డి మాట్లాడుతూ…రాష్ట్రంలో అధికారం చేపట్టడం ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ ముందున్న ప్రధాన లక్ష్యమని, అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి ఎవరన్నది అధిష్ఠానమే నిర్ణయిస్తుందని తెలియ‌చేసారు.

ఇచ్చిన హమీలు నెర‌వేర్చ‌లేక‌నే కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లారు అని చెప్పారు. డ‌బ్బుల మూట‌ల‌తో ఎన్నిక‌ల్లో గెల‌వాల‌ని చూస్తున్నారు. కేసీఆర్ నియంత‌లా వ్య‌వ‌హ‌రిస్తూ ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నార‌న్నారు. నియంతలా వ్యవహరిస్తున్న కేసీఆర్‌ తీరును ప్రజలు అర్థం చేసుకున్నారని, ఎన్నికల్లో ఆయనకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.  ఈనెల 8వ తేదీన కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా విడుదలవుతుందని జానారెడ్డి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here